Rahul Gandhi on BJP's Hindutva: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బీజేపీ 'హిందుత్వ' సిద్ధాంతంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హిందూయిజానికి, హిందుత్వకు మధ్య తేడాను వివరిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ వాదులు (Hindutva-Vadi) అధికారం వెనకాల పరిగెడుతారని... అధికారమే వారికి పరమావధి అని విమర్శించారు. హిందువులు మహాత్మా గాంధీ లాగా సత్యాన్వేషణలో ఉంటారని... హిందుత్వ  వాదులకు సత్యంతో పని లేదని అన్నారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఆదివారం (డిసెంబర్ 12) నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'నేనొక హిందువుని (Hindu)... ఇక్కడున్నవారంతా హిందువులు... కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నవారు హిందుత్వ వాదులు... తేడా ఏంటో నేను వివరిస్తాను... మహాత్మా గాంధీ (Mahatma Gandhi) ఒక హిందువు... నాథురాం గాడ్సే (Nathuram Godse) హిందుత్వ వాది.. హిందుత్వ వాదులకు అధికారం తప్ప ఏమీ అవసరం లేదు... అధికారం కోసం వారు ఏమైనా చేస్తారు... కానీ హిందువులు మహాత్మాగాంధీ లాగా సత్వాన్వేషణలో ఉంటారు...' అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.


దేశ రాజకీయాల్లో ప్రస్తుతం హిందు, హిందుత్వ అనే రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య పోటీ నెలకొందన్నారు. ఎవరైతే అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారో... ఎవరికీ భయపడరో... వారే హిందువులని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 'ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ఫేక్ హిందువులు... కేంద్రంలో ఉన్నది హిందూ రాజ్యం కాదు... హిందుత్వ రాజ్యం... ఈ హిందుత్వ వాదులను అధికారం నుంచి తప్పించి మళ్లీ హిందూ రాజ్యాన్ని తిరిగి తీసుకురావాలి...' అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పుకొచ్చారు.


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తదితర నేతలు జైపూర్‌లోని కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, ఎల్‌పీజీ సిలిండర్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఈ బహిరంగ సభను నిర్వహించారు. సభకు జనం భారీ ఎత్తున తరలివచ్చారు.


Also Read: Video: అమెరికాలో టోర్నడోల బీభత్సం ఏ రేంజ్‌లో ఉందంటే-వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి