Rahul Gandhi - Congress:  ఉత్తర ప్రదేశ్‌ దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం. ఇక్కడ ఎక్కువ సీట్లు ఎవరు గెలిస్తే.. వాళ్లదే కేంద్రంలో అధికారం. గత రెండు పర్యాయాలు ఇక్కడ నుంచే ఎక్కువ లోక్ సభ స్థానాలను కైవసం చేసుకొని కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాంటి కీలక రాష్ట్రంలో అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాలు గాంధీ కుటుంబానికీ కంచుకోటగా నిలుస్తూ వస్తున్నాయి. ఈ నియోజకవర్గాల నుంచే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత అదే పరంపరా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కొనసాగిస్తూ వస్తున్నారు. గత పర్యాయం మాత్రం అమేథీ నుంచి రాహుల్ గాంధీ దారుణమైన ఓటమి పాలయ్యారు. అది కూడా బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో. అందుకే అప్పట్లో రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేసి లోక్ సభలో అడుగుపెట్టారు. ఈ సారి కూడా అదే వాయనాడ్ నుంచి రెండోసారి బరిలో దిగారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే సమయంలో అమేథీ నుంచి పోటీ చేస్తారనే వార్త కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తోంది.  ఇక కేరళలోని వాయనాడ్‌కు రెండో విడతలో భాగంగా ఈ నెల 26న ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక యూపీలో అమేథీ నియోజవర్గానికి ఐదో విడతలో భాగంగా మే 20న అక్కడ ఎన్నికల జరగనున్నాయి. రేపటితో (3-5-2024) నామినేషన్లకు చివరి గడువు. ఈ సారి రాహుల్ గాంధీ ఈ నామినేషన్ దాఖలు చేస్తారా.. ? తన తల్లి పోటీ చేసిన రాయబరేలి నుంచి బరిలో నిలిచి.. అమేథీ నుంచి తన చెల్లెలు ప్రియాంక వాద్రాను రంగంలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నారా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.


అయితే ప్రియాంక తల్లి సోనియా బరి నుంచి తప్పుకున్న రాయబరేలి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాహుల్ గాంధీ మాత్రం పార్లమెంట్‌లో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు సభ్యులు ఉభయ సభల్లో ఉండటాన్ని ఇష్టపడటం లేదనే టాక్ వినిపిస్తోంది. అందరు చెప్పినట్టుగా కుటుంబ పార్టీ ముద్ర నుంచి బయట పడాలంటే ప్రియాంక ఈ సారి పోటీలో ఉండకూడదనేది రాహుల్ ప్రతిపాదన అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.



ఒకవేళ కీలకమైన ఉత్తరప్రదేశ్‌ నుంచి బరిలో లేకుంటే ఆ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్‌కు తప్పుడు సంకేతాలు వెళతాయి. మరి కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకున్నట్టు రాహుల్ యూపీలో అమేథీ, రాయబరేలి నియోజకవర్గాల్లో ఏ స్థానం నుంచి పోటికి దిగుతారానేది చూడాలి.  లేకపోతే వేరేవాళ్లకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తారా అనేది చూడాలి.


Also read: KCR Ban: కేసీఆర్‌కు ఎన్నికల సంఘం ఝలక్‌.. 48 గంటల పాటు ప్రచారం నిషేధం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook