Rahul Gandhi comments on PM Modi: ఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) ని లక్ష్యంగా చేసుకుంటూ పలు విమర్శలు సంధించారు. గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య జరిగిన హింసాత్మక ఘటన నాటినుంచి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా గురువారం ఆయన ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసి ఇలా రాశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ఇమేజ్‌ను పెంచుకోవడంపైనే వందశాతం దృష్టి పెట్టారని రాహుల్ పేర్కొన్నారు. భారత్‌లోని పలు వ్యవస్థలు ప్రధాని ఇమెజ్‌ను పెంచడంలో నిమగ్నమై ఉన్నాయని ఆయన ఆరోపించారు. కేవలం ఒక వ్యక్తి ఇమేజ్ జాతీయ విజన్‌కు ప్రత్యామ్నాయం కాదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. Also read: COVID-19: దేశంలో కరోనా ఉగ్రరూపం



అయితే.. రాహుల్ పోస్ట్ చేసిన వీడియోలో భారత్-చైనా ( India-China ) మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను ప్రస్తావించారు. చైనాను ఎదుర్కొనే విషయంలో ప్రధానికి సరైన విజన్ లేదని విమర్శించారు. మనం బలహీనులుగా ఉంటే.. చైనా రెచ్చిపోతుందని అభిప్రాయపడ్డారు. కేవలం ధైర్యంతోనే చైనాను ఎదర్కోగలమని, మన ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఉందని రాహుల్ పేర్కొన్నారు. చైనాతో సరిహద్దు వెంబడి నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాహుల్ విమర్శించారు.  కేంద్ర ప్రభుత్వానికి దీర్ఘ దృష్టి లేదని, దాని కారణంగానే అవకాశాలను చేజార్చుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. Also read: Sex racket: సెక్స్ రాకెటీర్ సోనూ పంజాబన్‌కి 24 ఏళ్ల జైలు శిక్ష