కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ.. సోనియా గాంధీ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో రాహుల్.. పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తల్లి సోనియా గాంధీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరయ్యారు. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి చెల్లెలు ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా , కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, సీనియర్ నాయకులు హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం బయట పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు. రాహుల్ ప్రమాణ స్వీకారం చేశాక బాణా సంచా కాలుస్తూ..  మిఠాయిలు పంచారు. కార్యకర్తల సంబరాలతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.