Rahul Gandhi ties Sonia Gandhi Shoe Lace in Congress Bharat Jodo Yatra: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు (3,570 కిమీ)  భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. 148 రోజుల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా రాహుల్ పాదయాత్ర సాగనుంది. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ జోడో యాత్ర ఆరంభం అయింది. రాహుల్ పాదయాత్ర ఇప్పటికే తమిళనాడు, కేరళలో పూర్తి చేసుకుని.. ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది. దసరా పండగ నేపథ్యంలో రాహుల్ రెండు రోజుల పాటు బ్రేక్ తీసుకున్నారు. నేటి ఉదయం మండ్య జిల్లాలోని పాండవపురాలో పాదయాత్ర ఆరంభం అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాండవపుర తాలూకాలోని బెల్లాలే గ్రామం నుంచి రాహుల్ గాంధీ గురువారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. భారత్​ జోడో యాత్ర నేటితో 29వ రోజు. రాహుల్ అమృతగ్రామ సమీపానికి చేరుకున్న సమయంలో.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు. కుమారుడు రాహుల్, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి సోనియా దాదాపుగా 15 నిమిషాల పాటు నడిచారు. యాత్ర‌లో భాగంగా వాకింగ్ చేస్తున్న స‌మ‌యంలో సోనియా షూ లేస్ ఊడగా.. సెక్యూరిటీ, ఇతర నేతలను పక్కకు జరిపి మరీ రాహుల్ తన తల్లి లేస్ క‌ట్టారు.


[[{"fid":"247504","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


సోనియా గాంధీ కాసేపు నడిచాక.. తల్లి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని రాహుల్ గాంధీ తన పాదయాత్రను కాసేపు ఆపి ఆమెను కారులో కూర్చోపెట్టారు. ప్రస్తుతం సోనియా యాత్రను కారులో అనుసరిస్తున్నారు. సోనియా రెండుసార్లు కరోనా మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో ఆమె అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం సోనియా పూర్తిగా కోలుకోకున్నా.. తనయుడి కోసం పాదయాత్రకు వచ్చారు. సోనియా యాత్రలో పాల్గున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ మరింత పెరిగింది. 


Also Read: Kyle Mayers Six: వాట్ ఏ షాట్.. నెవర్ బిఫోర్ సిక్స్! వీడియో చూస్తే మతిపోవాల్సిందే


Also Read: Ananya Nagalla Saree Photos: అందాల ఆరబోత బోర్ కొట్టిందేమో.. పద్దతిగా చీరకట్టులో కవ్విస్తున్న అనన్య నాగళ్ల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook