రాహుల్‌ గాంధీ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది.  సోనియా అధ్యక్షతను సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ కు పార్టీ పగ్గాలు అప్పగించే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది.ఈ సందర్భంగా రాహుల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం. కాగా సోనియా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారు చేశారు..పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డిసెంబర్‌ 1న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. డిసెంబర్‌ 4న నామినేషన్లు స్వీకరిస్తారు.... డిసెంబర్‌ 16న ఎన్నికలు నిర్వహించి.. 19న ఫలితాలు వెల్లడించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిసెంబర్ 5న ముహుర్తం


రాహుల్ తప్పా ఇంకెవరు నామినేషన్ వేయకపోయినట్లయితే...నామినేషన్ల పరిశీలన రోజు..డిసెంబర్ 5న రాహుల్ ను పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2013లో రాహుల్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.. నాలుగేళ్ల తర్వాత ఆయన అధ్యక్ష బాధ్యత చేపడుతున్నారన్న మాట