కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేత మోహన్ భగవత్‌ను విమర్శించారు. భారతీయ సైన్యానికి వ్యతిరేకంగా భగవత్ చేసిన వాఖ్యలను ఖడించారు.'ఆర్ఎస్ఎస్ నేత భగవత్ వ్యాఖ్యలు భారతీయులను కించపరిచేలా ఉన్నాయి. ఆయన  వ్యాఖ్యలు మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని విమర్శించేటట్లు ఉన్నాయి. త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేసే జవాన్‌ను కించపరిచారంటే మన జాతీయ జెండాను అగౌరవపరిచినట్లే. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులు, జవాన్లను నిందించినందుకు భగవత్‌కు సిగ్గుండాలి. దీనికి ఆర్ఎస్ఎస్ క్షమాపణ చెప్పాలి' అని రాహుల్ ట్వీట్ చేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఆదివారం, ముజాఫర్ స్కూల్‌లో భగవత్ ప్రసంగిస్తూ- ఆర్ఎస్ఎస్ తలుచుకుంటే మూడు రోజుల్లో ఆర్మీని తయారుచేయగలదని.. భారత ఆర్మీకి ఆ పని చేసేందుకు ఆరు నుండి ఏడు నెలల సమయం పడుతుందని వ్యాఖ్యానించారు.