పార్టీ ఉపాధ్యక్ష పదవిలో ఉన్న రాహుల్ గాంధీని అధ్యక్షుడుగా ప్రమోషన్ ఇవ్వాలని గత కొంతకాలంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు కోరుతూ వస్తున్నారు. సోనియా కూడా అందుకు సానుకూలంగానే ఉంది. కానీ ఎప్పుడు ప్రకటిస్తే బాగుంటుందని వేచి చూస్తున్నారు.ఇప్పడు ఆ సమయం దగ్గరపడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాహుల్ కు పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించే కార్యక్రమానికి సంబంధించి సోమవారం కాంగ్రెస్ పెద్దలు సమావేశమవుతున్నారు. అధ్యక్ష ఎన్నికల కార్యక్రమాన్ని ఆమోదించడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసి) సోనియా నివాసం 10జన్ పథ్ లో చర్చించనున్నారు. ఆ సమావేశంలో ప్రధాన అజెండా పార్టీ అధ్యక్ష ఎన్నిక గురించే. రాహుల్ కు పార్టీ బాధ్యతల అప్పగింత మీదే చర్చ కొనసాగుతుంది. 


కాగా.. ఎన్నికల బరిలో రాహుల్ ఒక్కరే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో  సీడబ్ల్యూసి ఆమోదం తప్పనిసరి కాకపోయినా.. సోనియా సూచన మేరకు సమావేశం జరపాలని నిర్ణయించారు. గుజరాత్ శాసనసభకు డిసెంబర్ 9న ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలు జరిగేలోపే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష ఎన్నిక పూర్తవుతుంది. అంతర్గత ఎన్నికలు పూర్తి చేయడానికి ఎలక్షన్ కమీషన్ కాంగ్రెస్ పార్టీకి డిసెంబర్ 31 వరకు గడువునిచ్చింది.