Railway Tickets: రైలు ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ కోసం ఇకపై క్యూ లైన్ అవసరం లేదు!
Railway Tickets: భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది రైలులో ప్రయాణిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో స్టేషన్ల వద్ద టికెట్స్ కోసం ప్రయాణికులు బారులు తీరుతున్నారు. అంతటి క్యూ లైన్లను తప్పించుకునేందుకు ఇప్పుడు భారతీయ రైల్వే ప్రత్యేక వెసులుబాటును కల్పించింది. ఇకపై UPI ద్వారా డబ్బు పే చేసి.. స్టేషన్ లో క్యూ లైన్ లో నిల్చొకుండా టికెట్ పొందేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Railway Tickets: భారతీయ రైల్వేస్ లో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. దేశవ్యాప్తంగా 12,167 ప్యాసింజర్ రైళ్లలో 2 కోట్ల 30 లక్షల మంది ఇండియన్ రైల్వేస్ ను వినియోగిస్తున్నారు. ఇది ఆస్ట్రేలియా దేశ జనాభాకు సమానం. అయితే రైళ్లలో ప్రయాణించే వారు టికెట్స్ కోసం ప్రతి రోజూ క్యూ లైన్ లో నిల్చొవాలి. ఒక్కొసారి గంటల తరబడి క్యూ లైన్లలో టికెట్ల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది.
అయితే ఇకపై రైళ్లలో ప్రయాణించే వారు టికెట్స్ కోసం లైన్ లో నిల్చొవాల్సిన అవసరం లేదు. అందుకు సంబంధించి భారతీయ రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Paytm యాప్ లో రైలు టికెట్స్..
రైలులో ప్రయాణించేందుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన యాప్ IRCTCలో టికెట్స్ బుక్ చేసుకోవాలి. దీంతో పాటు ప్రముఖ డిజిటల్ చెల్లింపుల యాప్స్ PayTM, PhonePe లలో రైల్ టికెట్స్ ను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. వీటితో పాటు అప్పటికప్పుడు రైలు ప్రయాణం చేసే వారు రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉండే ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్స్ (ATVM) ద్వారా టికెట్స్ ను కొనుగోలు చేయవచ్చు. అయితే ఇప్పుడు ఆ ప్రక్రియను మార్చి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రతి టికెట్ వెండింగ్ మెషీన్ వద్ద UPI సేవలను ప్రవేశపెట్టనున్నారు.
QR కోడ్‌ని స్కాన్ చేస్తే చాలు..
రైల్వే స్టేషన్‌లలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్స్ (ATVM)లు టచ్ స్క్రీన్ ఆధారితమైనవి. ఇప్పటి వరకు డబ్బుతో టికెట్స్ కొనుగోలు చేస్తుండగా.. ఇకపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా టికెట్ తీసుకోవచ్చు. దీని ద్వారా ప్లాట్ ఫారమ్ టికెట్లను కూడా కొనొచ్చు. దీని ద్వారా Paytm, PhonePe, Gpay ద్వారా డబ్బు పే చేసి టికెట్ పొందవచ్చు.
రైలు టికెట్ ఎలా కొనుగోలు చేయాలి..
- సమీప రైల్వే స్టేషన్‌లోని ATVMలో రీఛార్జ్ కోసం స్మార్ట్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి.
- Paytm ద్వారా చెల్లింపు ఎంపికగా ఎంచుకోండి.
- లావాదేవీని సులభంగా చేసేందుకు QR కోడ్‌ని స్కాన్ చేయండి.
- స్కాన్ చేసిన తర్వాత ఫిజికల్ టికెట్ అనేది జనరేట్ అవుతుంది.
Also Read: Railway Rules: రైలు బెర్త్ ప్రయాణంలో మార్పులు.. తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook