Weather update: అలర్ట్.. జూలై 31 వరకు ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
Weather forecast: దేశంలోని ఈ రాష్ట్రాల్లో జూలై 31 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వాతావరణ ఉండబోతుందో తెలుసుకుందాం.
Weather updates: దేశవ్యాప్తంగా ఏయే రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయో వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాఖండ్‌లో జూలై 31 వరకు తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా-చండీగఢ్-ఢిల్లీ మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో జూలై 29 వరకు ఇదే వాతావరణం ఉంటుందని వెల్లడించింది. తూర్పు ఉత్తరప్రదేశ్ లో జూలై 31 మరియు రాజస్థాన్ మరియు జమ్మూ కాశ్మీర్‌లో జూలై 28 వరకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
పశ్చిమ భారతదేశం విషయానికొస్తే.. కొంకణ్ మరియు గోవా మరియు మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాలలో జూలై 29 వరకు మరియు గుజరాత్ ప్రాంతంలో జూలై 28 వరకు తేలికపాటి నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది మరోవైపు ఆర్థిక రాజధాని ముంబైలో ఈనెల 28న వరకు భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.
జూలై 27 నుండి 29 వరకు సెంట్రల్ ఇండియన్ స్టేట్స్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. జులై 27-28 తేదీల్లో విదర్భ, చత్తీస్‌గఢ్‌లో భారీ నుంచి అతి భారీ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు తీర రాష్ట్రమైన ఒడిశాలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు జూలై 28న తెలంగాణ, కోస్టల్ కర్ణాటక, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మరియు మేఘాలయలో జూలై 28న, జూలై 30 నుండి ఆగస్టు 2 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Also Read: Mumbai Rains: ముంబైకి ఆరెంజ్ అలర్ట్.. పాల్ఘర్, థానేల్లో స్కూళ్లు బంద్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook