Rains: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వర్ష బీభత్సానికి నదులు, వంకలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వరద నీటిలో వాహనాలు చిక్కుకుపోయాయి. మరికొన్ని చోట్లు రోడ్లు కుంగిపోయాయి. ఈవిజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుజరాత్‌లో 24 గంటల వ్యవధిలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఇంటి గోడ కూలి 8 మంది మృతిచెందారు. అహ్మదాబాద్, రాజ్‌కోట్‌లో వరద నీరు ఉప్పొంగుతోంది. వరదల కారణంగా గుజరాత్‌లో మొత్తం 64 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇటు మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలో రెడ్‌ అలర్ట్ జారీ చేశారు. 


మొత్తం 27 జిల్లాల్లో మరింత అప్రమత్తం అవసరమని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటివరకు 6 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటు ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, హర్యానాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడురోజులుగా ఏపీ, తెలంగాణలో ముసురు పట్టుకుంది.


Also read:Shaking Seshu: కిరాక్ ఆర్పీ పెద్ద ఫ్రాడ్.. 20 లక్షలు టోపీ.. హోం టూర్ ఇల్లు కూడా మోసమే.. సంచలన విషయాలు బయటపెట్టిన షేకింగ్ శేషు


Also read:IND vs ENG: నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే..టీమిండియా తుది జట్టు ఇదే..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook