Yamuna danger mark: ఉత్తరాదిలో జల విలయం కొనసాగుతోంది. కుండపోత వర్షాలకు వాగులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక ఢిల్లీలోని యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి మరి ప్రవహిస్తోంది. ఎగువ రాష్ట్రాల నుండి వరద నీరు ఎక్కువ వస్తుండటంతో యమునాలో నీటిమట్టం పెరుగుతుంది. యమునా నదిలో నీటి మట్టం 206.24 మీటర్లకు చేరుకుందని.. ఇది ప్రమాద స్థాయి 205.33 మీటర్ల కంటే కొంచెం ఎక్కువగా ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది. దిల్లీలో ఈ నది అత్యధిక వరద ముప్పు స్థాయి 207.49 మీటర్లు. వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని పాత యమునా వంతెనపై రైలు రాకపోకలను ఈరోజు ఉదయం 6:00 గంటల నుండి తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఉత్తర రైల్వే తెలిపింది. అంతకుముందు పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటిమట్టం 206.04 మి.మీగా నమోదైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నది ప్రవాహం పెరగడంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ యంత్రాంగం యమునా నది పరిసరాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించే ప్రక్రియను మెుదలుపెట్టారు. యమునా నీటి మట్టం పెరగడం వల్ల నగరానికి వరద ముప్పు ప్రమాదం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. మరోవైపు చార్‌ధామ్‌, అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 


ఇదిలా ఉండగా, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోని వికాస్‌నగర్లో కుండపోత వర్షాల కారణంగా యమునాలో నీటి మట్టం పెరుగుదల కనిపించింది. దేశ రాజధానితో సహా వాయువ్య భారతదేశం అంతటా వర్షాల కారణంగా హర్యానా హత్నికుండ్ బ్యారేజీ నుండి నదిలోకి ఎక్కువ నీటిని విడుదల చేయడంతో యమునాలో నీటి మట్టం నిరంతరం పెరుగుతోంది. వరద నియంత్రణ విభాగం ప్రకారం, మధ్యాహ్నం 3 గంటలకు హత్నికుండ్ బ్యారేజీ ద్వారా దాదాపు 2,15,677 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 


Also Read: Heavy Rains: ఉత్తరాదిన ఊహకందని జల విలయం.. ఇబ్బందుల్లో జనం.. 37కి చేరిన మృతులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook