సీఎంకు బెదిరింపులు.. యువకుడి అరెస్ట్
సీఎంకు బెదిరింపులు.. యువకుడి అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను దూషించి, బెదిరింపు ఈ మెయిల్స్ పంపిన కేసులో రాజస్తాన్‌కి చెందిన యువకుడిని ఢిల్లీ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి నుంచి తనను దూషిస్తూ, ఈ మెయిల్స్ రావడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా రాజస్థాన్‌లోని అజ్మీర్‌కి చెందిన ఓ యువకుడు ఈ నేరానికి పాల్పడినట్టు తేలింది.
యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులకు అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని తెలియడంతో అతన్ని మెడికల్ కౌన్సెలింగ్‌కు తరలించారు. గతంలోనూ పలువురు ప్రముఖులను బెదిరిస్తూ అజ్మీర్ యువకుడు మెయిల్స్ పంపించారని పోలీసుల దర్యాప్తులో బయటపడింది.