Rajasthan Judge: తీవ్ర దూమారం.. రేప్ బాధితురాలిని దుస్తులు విప్పాలని కోరిన జడ్జి
Rajasthan Court Magistrate Booked: రాజస్థాన్‌లో ఓ న్యాయమూర్తి వ్యవహరశైలిపై తీవ్ర దూమారం చెలరేగుతోంది. గాయాలు చూసేందుకు రేప్ కేసు బాధితురాలిని దుస్తులు విప్పాలని కోరడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా..
Rajasthan Court Magistrate Booked: అత్యాచార బాధితురాలి గాయాలు చూసేందుకు బట్టలు విప్పమని మెజిస్ట్రేట్ ఆదేశించిన ఘటన రాజస్థాన్‌లో కరౌలీ జిల్లాలో చోటుచేసుకుంది. గత నెల 19న తనపై అత్యాచారం జరిగిందని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై జిల్లా కోర్టులో విచారణ సందర్భంగా జడ్జి బట్టలు విప్పి గాయాలు చూపించాలని ఆదేశించారు. నిరాకరించిన ఆ యువతి జడ్జిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ విషయంపై దుమారం రేగుతోంది. అత్యాచార బాధితురాలి పట్ల జడ్జి చేసిన సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మహిళా సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు ఇలా..
తనపై సామూహిక అత్యాచారంపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అనంతరం మార్చి 30న బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు మున్సిఫ్ కోర్టుకు చేరుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు ఉండగా.. బాధితురాలిని మేజిస్ట్రేట్ తన ఛాంబర్‌లోకి పిలిచారు. లోపల స్టేట్‌మెంట్ తీసుకున్న తరువాత ఆమెను ఆపి శరీరంపై గాయాలను చూడాలని.. దుస్తులు విప్పాలని అడిగారు. మహిళా పోలీసు లేకుండా ఆమె దుస్తులు తీసేందుకు నిరాకరించడంతో బయటకు పంపించారు. అనంతరం న్యాయమూర్తి చెప్పిన విషయాలను బాధితురాలు తల్లి, సోదరులకు చెప్పింది. హిందౌన్ సిటీ పోలీస్ సూపరింటెండెంట్‌కు జడ్జీపై వారు ఫిర్యాదు చేశారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఈ విషయంపై విచారణ అధికారిని నియమించారు.
న్యాయమూర్తిని విచారించేందుకు రాజస్థాన్ హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ అజయ్ చౌదరి హిందౌన్ సిటీకి వచ్చారు. దాదాపు 3 గంటల పాటు మేజిస్ట్రేట్‌ను విచారించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేసమయంలో ఇతర న్యాయమూర్తులను, ఇతర న్యాయవాదులను పిలిపించి ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తి ప్రవర్తనపై సమాచారం తీసుకున్నారు.
మరోవైపు బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగినప్పటి నుంచి రాజీ కోసం నిందితులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెను కేసు వెనక్కి తీసుకోవాలంటూ బెదిరిస్తున్నారు. దీంతో బాధితురాలి కుటుంబం ఊరు విడిచి వెళ్లిపోయింది. విషయం తెలసుకున్న పోలీసులు ఆమె కుటుంబాన్ని తిరిగి గ్రామానికి తీసుకొచ్చారు. పోలీసుల సహాకారంతో మూడు రోజుల తరువాత ఇంటికి తిరిగి వచ్చామని బాధితురాలి సోదరుడు తెలిపాడు. గ్యాంగ్ రేప్ కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ గిర్వార్ సింగ్ తెలిపారు. మహిళా కుటుంబానికి కూడా భద్రత కల్పిస్తామని చెప్పారు.
Also Read: Sangareddy Blast: సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఏడుగురు కార్మికులు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitter సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి