ప్రధాని మరో కీలక నిర్ణయం: రాజీవ్ ఖేల్‌రత్న పేరు మార్పు.. ఇకపై మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు!
Khel Ratna Award: ప్రధాని మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో క్రీడాకారులకు ప్రధానం చేసే అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుగా మార్పు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Khel Ratna Award: భారతదేశంలో క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న (Rajiv Gandhi Khel Ratna Award)పేరును ఇక నుంచి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మారుస్తున్నట్లు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే.. వారి మనోభావాలను గౌరవిస్తూ.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
"ఖేల్‌రత్న అవార్డుకు మేజర్ ధ్యాన్‌చంద్ పేరు పెట్టాలని అనేకమంది నుంచి అభ్యర్ధనలు వస్తున్నాయి. వారి అభిప్రాయాలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ.. ఖేల్‌రత్న పురస్కారానికి మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుగా ఇకపై పిలుస్తారు. జై హింద్!" అని ప్రధాని మోదీ (PM Modi) ట్వీట్ చేశారు.
Also read: గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు: ఎస్బీఐలో బంగారంపై రుణాలు.. యోనో యాప్‌తో వడ్డీ రేట్లపై డిస్కౌంట్ ఆఫర్స్
ఖేల్ రత్న అవార్డు దేశంలో అత్యున్నత క్రీడా గౌరవం. ఈ ప్రతిష్టాత్మక అవార్డు కింద రూ. 25 లక్షల ప్రైజ్ మనీని ఇస్తారు. అదే విధంగా టోక్యో ఒలింపిక్స్ లో (Tokyo olympics) అసాధారణరీతిలో పోరాట పటిమ ప్రదర్శించిన పురషులు, స్తీల హాకీ జట్లును మోదీ ప్రశంసించారు. రాబోయే రోజుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచడానికి వీరి విజయాలు దోహదపడతాయని మోదీ తెలిపారు.
Also read: ఓ మై కడవులే తెలుగు రీమేక్: విజయ్ సేతుపతి పాత్రలో అల్లు అర్జున్ ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook