కేంద్ర నూతన ఎన్నికల కమీషనర్ ( New Election Commissioner ) గా రాజీవ్ కుమార్ ( Rajiv kumar ) బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఇదే పదవిలో ఉన్న అశోక్ లవాసా రాజీనామా చేసి ఏడీబీ బ్యాంకు ఉపాధ్యక్షుడిగా వెళ్లడంతో ఈ పదవి ఖాళీ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కేంద్ర ఎన్నికల కమీషన్ లో మార్పులు చోటుచేసుకున్నాయి. నూతన ఎన్నికల కమీషనర్ ( Central Election commissioner ) గా కొద్దిరోజుల క్రితం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ ను నియమించిన విషయం తెలిసిందే. ఇవాళ రాజీవ్ కుమార్ నూతన ఎన్నికల కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. 1984 జార్ఘండ్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ కుమార్ ఆర్ధిక శాఖ కార్యదర్శిగా పని చేశారు గతంలో. అంతేకాకుండా పబ్లిక్ పాలసీ, అడ్మినిస్ట్రేషన్ లో 30 ఏళ్లకు పైగా అనుభవముంది. మాస్టర్స్ డిగ్రీతో పాటు ఎల్ ఎల్ బీ కూడా చదివారు. గతంలో ఈ పోస్టులో ఉన్న  అశోక్ లవాసా ( Ashok lavasa ) రాజీనామా చేసి..ఆసియా డెవలప్మెంట్ బోర్డ్ బ్యాంకు ( ADB Bank ) ఉపాధ్యక్షుడిగా వెళ్లారు. ఏప్రిల్ 29న ఆర్ధిక శాఖ కార్యదర్శిగా రాజీనామా చేసిన రాజీవ్ కుమార్ ను ఇదే ఏడీబీ బ్యాంకు పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు ఛైర్మన్ గా నియమించింది. నూతన ఎన్నికల కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ కుమార్ ను పలువులు అభినందిస్తున్నారు. Also read: AGR Dues: సుప్రీంకోర్టులో టెలికాం కంపెనీలకు ఊరట