MPs suspension: సమావేశాలను బహిష్కరించిన విపక్ష పార్టీలు
వ్యవసాయ బిల్లుల (Agriculture Bills) పై, ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ విధించడంపై మంగళవారం కూడా పార్లమెంట్ దద్దరిల్లింది. ఈ మేరకు పలు విపక్ష పార్టీలన్నీ కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Farm Bills, MPs suspension, Opposition boycott: ఢిల్లీ: వ్యవసాయ బిల్లుల (Agriculture Bills) పై, ఎనిమిది మంది రాజ్యసభ (Rajya Sabha) సభ్యులపై సస్పెన్షన్ విధించడంపై మంగళవారం కూడా పార్లమెంట్ దద్దరిల్లింది. ఈ మేరకు పలు విపక్ష పార్టీలన్నీ కీలక నిర్ణయం తీసుకున్నాయి. వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని, 8 మంది సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తి వేసే వరకు రాజ్యసభ సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నట్లు (Opposition boycott) ప్రకటించాయి. మొదట రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) మాట్లాడుతూ.. వ్యవసాయ బిల్లుపై ఓటింగ్‌కు అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతోపాటు వ్యతిరేకించిన సభ్యులను సస్పెండ్ చేయడం దారుణమని ఈ అంశాలపై పునరాలోచించుకునే వరకు సభనుంచి బయ్‌కాట్ చేస్తున్నట్లు తెలిపి వాకౌట్ చేశారు. అనంతరం ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ పలువురు సభ్యులు సైతం సభనుంచి వాకౌట్ చేశారు. ఓటింగ్‌కు అనుమతివ్వకుండా రైతులకు నష్టపరిచే బిల్లులను ఆమోదింపజేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సభను బహిష్కరించిన పార్టీల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ , తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్, డీఎంకే, ఆర్జేడీ, శివసేన, ఎస్పీ, వామపక్షపార్టీలు ఉన్నాయి. Also read: Rajya Sabha Ruckus: 8 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్
ఆ తర్వాత విపక్షపార్టీల సభ్యులందరూ.. పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న సస్పెన్షన్‌కు గురైన ఎంపీల దగ్గరకు వెళ్లి నిరసన తెలిపారు. అనంతరం వారితో పలువురు ఎంపీలు సంభాషించారు. ఆ తర్వాత సస్పెన్షన్ గురైన 8మంది ఎంపీలు దీక్షను విరమింపజేస్తున్నట్లు ప్రకటించారు. Also read: Rajya Sabha: క్షమాపణ చెబితే అవమానించారు: ఎంపీ ఆవేదన
ఇదిలాఉంటే.. సభ్యుల సస్పెన్షన్‌పై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు మంగళవారం సభలో వివరణ ఇచ్చారు. ఎంపీల అనుచిత ప్రవర్తన కారణంగానే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని.. వారి సస్పెన్షన్‌పై తాను సంతోషంగా లేనంటూ చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. విపక్షపార్టీలు సహకరించాలని, సభనుంచి వెళ్లిపోవద్దని కోరారు.