'రామజన్మ భూమి' కోసం హిందూ సమాజం మరో త్యాగానికి సిద్ధంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపి వినయ్ కతియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  "రామ్ జన్మభూమి కోసం మరో త్యాగం అవసరం. దీనికి హిందూ సమాజం సిద్ధంగా ఉండాలని నేను భావిస్తున్నాను. ములాయం సింగ్ యాదవ్ డిసెంబర్ 6, 1992న కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో అనేక మంది చంపబడ్డారు. రామ్ జన్మభూమి కోసం మరో విధమైన విప్లవం ప్రేరేపించబడాలి. మా హిందూ సమాజం మరో త్యాగానికి  సిద్ధంగా ఉండాలి" అని కతియార్ ఏఎన్ఐకి చెప్పారు.


1992 డిసెంబర్ 6 న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటనను కతియార్ ప్రస్తావిస్తూ, మాజీ సమాజ్వాది పార్టీ (ఎస్పీ) చీఫ్ ములాయం సింగ్ యాదవ్  హిందూ కరసేవకులపై కాల్పులు జరిపారని, ఫలితంగా అనేమంది చనిపోయారని చెప్పారు. అయోధ్యలో వేలాదిమంది హిందూ కరసేవకులు మసీదును పడగొట్టారు. తరువాత జరిగిన అల్లర్లలో 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది అని అన్నారు.