Ramadan 2023 Diet: ముస్లింల పవిత్ర మాసం రంజాన్ మార్చ్ 24 అంటే రేపట్నించి ప్రారంభం కానుంది. సౌదీ దేశాల్లో ఇవాళ్టి నుంచి మొదలైంది. ఏప్రిల్ 22 లేదా 23 తేదీల్లో రంజాన్ పండుగ అంటే ఈదుల్ ఫిత్ర్ ఉంటుంది. ఏప్రిల్ 21న చంద్ర దర్శనమైతే 22న పండుగ ఉంటుంది. లేదా 23వ తేదీన ఈదుల్ ఫిత్ర్ జరుపుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రంజాన్ 9వ నెల. పగలంతా ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కూడా చాలా లాభాలున్నాయి. అయితే కొన్ని సూచనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉపవాసం ఉన్నప్పుడు సహరీ, ఇఫ్తార్ విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు


1. ఉపవాసం ఉండాలంటే ముందుగా సహరీ పూర్తి చేయాలి. సహరీ లేకుండా ఉపవాసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదు. ఉదయం ఉపవాసం ప్రారంభించేముందు ఏదైనా తినాల్సి ఉంటుంది. ఫలితంగా రోజుంతా ఉండేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది. దాహం కూడా తక్కువ వేస్తుంటుంది. 


2. ఇక ఇఫ్తార్ సమయంలో అంటే ఉపవాసం విడిచే సమయంలో తప్పకుండా తినాలి. వాస్తవానికి ఆ సమయంలో తిండి కంటే ఎక్కువ నీటి అవసరం ఉంటుంది. అందుకే ఇఫ్తార్ సమయంలో నిమ్మకాయ రసం లేదా కొబ్బరి నీళ్లు ఉంచుకుంటే మంచిది. టీ లేదా కాఫీకు దూరంగా ఉంటే బెటర్


3. పప్పులు, బీన్స్, లీన్ మీట్, చేపలు, పాల ఉత్పత్తులు, గుడ్లు తినవచ్చు. ఇందులో ప్రోటీన్లు పెద్దమొత్తంలో ఉండటం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరం. పండ్లు, గుప్పెడు డ్రైఫ్రూట్స్ లేదా సలాడ్ స్నాక్‌గా కూడా తీసుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, ఖనిజ పదార్ధాలు, ఫైబర్ నిండిన డైట్ తీసుకుంటే ఆరోగ్యానికి లాభదాయకం. 


4. ఇఫ్తార్ సమయంలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. దీనివల్ల దీర్ఘకాలం ఎనర్జీ లభిస్తుంది. దాంతోపాటు ఫైబర్, ఖనిజ పదార్ధాలు అధికంగా ఉండే పదార్ధాల్ని డైట్‌లో చేర్చుకోవాలి.


5. వేర్వేరు రంగుల కూరగాయల్ని తినాలి. ఇందులో విటమిన్లు, ఖనిజ పదార్ధాలు, ఫైబర్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అదే సమయంలో కేలరీలు తక్కువగా ఉంటాయి.


6. హై కేలరీ, పంచదార నిండిన పదార్ధాలు, ఆయిలీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. లేకపోతే జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తాయి. గ్యాస్ సమస్య ఉత్పన్నం కావచ్చు. 


Also read: Covid19 Cases in India: భారీగా పెరిగిన కరోనా వైరస్ కేసులు, ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook