Ramadan 2023 Moon Sight: కన్పించని నెలవంక, ఇండియాలో రంజాన్ ఉపవాసాలు మార్చ్ 24 శుక్రవారం నుంచే
Ramadan 2023 Moon Sight: రంజాన్ నెల వచ్చేసింది. మరి కొద్దిగంటల్లో ఉపవాస దీక్షలు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ముస్లింల పవిత్ర నెల రంజాన్ దీక్షలు ఇండియాలో, సౌదీలో ఎప్పటి నుంచనే క్లారిటీ వచ్చేసింది. ఆసక్తిగా ఎదురుచూసిన నెలవంక కన్పించలేదు.
Ramadan 2023 Moon Sight: ఇండియాలో ఇవాళ నెలవంక కన్పించలేదు. దాంతో రంజాన్ నెల ప్రారంభం ఎప్పుడనేది తేలిపోయింది. ఇండియాలో నెలవంక కన్పించకపోవడంతో ఉపవాసాలు 24వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభం కానుండగా, సౌదీ దేశాల్లో రేపట్నించి మొదలవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే రంజాన్ మాసం వచ్చేసింది. సౌదీ దేశాల్లో రేపట్నించి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి. ఇండియా సహా పొరుగుదేశాల్లో ఈ నెల 24వ తేదీ నుంచి ఉపవాసాలు మొదలవబోతున్నాయి. ఇవాళ నెలవంక కన్పించకపోవడంతో ఇక శుక్రవారం నుంచే ప్రారంభం నిర్ధారణైపోయింది.
చంద్రమానం ప్రకారం ఇస్లామిక్ క్యాలెండర్ ఉండటంతో రంజాన్ ప్రారంభ తేదీ విషయంలో ఎప్పుడూ సందిగ్దత ఉండనే ఉంటుంది. అరబిక్ క్యాలెండర్ ప్రకారం అరబ్ దేశాల్లో షాబాన్ నెలలో ఇవాళ 30వ రోజు. నిన్న షాబాన్ నెల 29వ రోజున చంద్ర దర్శనం కాకపోవడంతో ఇవాళ్టితో షాబాన్ 30 రోజులు పూర్తవుతున్నాయి. అంటే సౌదీ దేశాల్లో రేపట్నించి విధిగా ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఇండియాలో కూడా మార్చ్ 22 వ తేదీ అంటే ఇవాళ చంద్ర దర్శనమైతే 23 నుంచి ఉపవాసాలు ప్రారంభం కావల్సి ఉన్నాయి. అయితే ఇండియాలో చంద్ర దర్శనం కాకపోవడంతో ఇక ఉపవాసాలు మార్చ్ 24 శుక్రవారం నుంచి మొదలవుతాయి.
యూఏఈలో మార్చ్ 21 సాయంత్రం మగ్రిబ్ నమాజ్ అనంతరం నెలవంక దర్శనం కాలేదు. దాంతో ఇక షాబాన్ 30 రోజులు పూర్తి చేసుకుని రేపట్నించి ఉపవాసాలు ప్రారంభిస్తారు. ఎందుకంటే అరబిక్ క్యాలెండర్ ప్రకారం అరబ్ దేశాల్లో నిన్న షాబాన్ నెల 29వ రోజు. ఇవాళ 30 రోజులు పూర్తి కానున్నాయి. అరబ్ దేశాల్లో చంద్ర దర్శనంతో సంబంధం లేకుండా రేపట్నించి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి. ఇండియా విషయం పరిశీలిస్తే..మార్చ్ 22వ తేదీ అంటే ఇవాళ చంద్ర దర్శనం కాకపోవడంతో..ఇక ఎల్లుండి అంటే శుక్రవారం నుంచే ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి.
Also read: Ramadan Mubarak 2023: మీ బంధుమిత్రులకు రంజాన్ శుభాకాంక్షలు ఇలా చెప్పండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook