భారత ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గొగోయ్
భారత ప్రధాని న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ నియమితులయ్యారు. ప్రస్తుత న్యాయమూర్తి దీపక్ మిశ్రా పదవీ కాలం గడుస్తున్నందున.. అక్టోబర్ 3 2018 తేది నుండి గొగోయ్ ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
భారత ప్రధాని న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ నియమితులయ్యారు. ప్రస్తుత న్యాయమూర్తి దీపక్ మిశ్రా పదవీ కాలం గడుస్తున్నందున.. అక్టోబర్ 3 2018 తేది నుండి గొగోయ్ ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తెలిపారు. 46వ భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవిని చేపట్టబోయే రంజన్ గొగోయ్ ఆ పదవిలో నవంబరు 2019 వరకు ఉండనున్నారు.
నవంబరు 18, 1954 తేదిన జన్మించిన జస్టిస్ గొగోయ్, 1978లో తొలిసారిగా న్యాయవాదిగా తన కెరీర్ ప్రారంభించారు. గౌహతి హైకోర్టులో ఆయన పనిచేసేవారు. 28 ఫిబ్రవరి, 2001 తేదిన గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా గొగోయ్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత బదిలీ మీద ఆయన పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు వెళ్లి అక్కడ కూడా న్యాయమూర్తిగా సేవలందించారు. 2012లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా రంజన్ గొగోయ్ బాధ్యతలు నిర్వర్తించారు. గొగోయ్ తండ్రి కేశభ్ చంద్ర గొగోయ్ గతంలో అస్సాంకు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.
రంజన్ గొగోయ్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని గొగోయ్‌కి భారత ప్రధాని న్యాయమూర్తిగా అవకాశమివ్వాలని ప్రస్తుత న్యాయమూర్తి దీపక్ మిశ్రా ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గత నెలలోనే దీపక్ మిశ్రాకు కొత్త న్యాయమూర్తిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందో తెలియజేస్తూ.. ఓ పేరును సిఫార్సు చేయమని కోరారు. రిలయన్స్ సంస్థ సెల్ టవర్లను ఏర్పాటు చేసుకున్నాక వాటికీ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాలని ప్రభుత్వం పిటీషను వేసిన కేసుతో పాటు.. కన్నయ్య కుమార్ జేఎన్‌యూలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న కేసులో కూడా రంజన్ గొగోయ్ కీలక తీర్పులు ఇచ్చారు.