Ratan tata hospitalized rumours Latest update: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఆయనను వెంటనే కుటుంబ సభ్యులు.. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారని వార్త ఒక్కసారిగా వైరల్ గా మారింది. దీంతో ఆయన అభిమానులు,పలువురు బిజినెస్ మెన్ లు సైతం రతన్ టాటా ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కొంత మంది రాజకీయ నాయకులు, సెలబ్రీటీలు ఫోన్ లు కూడా చేసి రతన్ టాటా హెల్త్ అప్ డేట్ పై ఆరా తీశారంట. దీంతో దీనిపై ఒక్కసారిగా రచ్చ రాజుకుంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఈ నేపథ్యంలో రతన్ టాటా దీనిపై ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, వయస్సు రీత్యా కొన్నిసమస్యలతో నార్మల్ గానే ఆస్పత్రికి వచ్చానని చెప్పారు.  కొంత మంది ఫెక్ వార్తలను ప్రచారం చేసినట్లు తెలిసిందని అన్నారు. ఐసీయూలో చేరినట్లు వార్తల్ని సైతం ఖండిచారు.  


Read more: Yogi adityanath: క్రికెటర్ అవతారమెత్తిన యోగి బాబా.. బ్యాట్ పట్టుకుని గ్రౌండ్‌లో హల్ చల్.. వైరల్‌గా మారిన వీడియో..


ఈ క్రమంలో..  86 సంవత్సరాల టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా ఓ ట్వీట్ చేశారు. తాను క్షేమంగా ఉన్నానంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా రతన్ టాటా అభిమానులు మాత్రం ఊపిరీపీల్చుకున్నట్లు తెలుస్తోంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.