Ratan Tata News: అంట్లు కూడా తోమారు.. రతన్ టాటా గురించి ఎన్నో నమ్మలేని నిజాలు!
Tata Ratan News: రతన్ టాటా అంటే భారతదేశంలో తెలియని వారు ఉండరు. ఆయన ప్రస్థానం మొదట ఎలా ప్రారంభమైందో. అంట్లు తోమడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Tata Ratan News In Telugu: రతన్ టాటా గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు.. కానీ ఆయన సమాజానికి చేసిన సేవ అంతో ఇంతో కాదు.. ఆయన భవిష్యత్ తరాల విలువలకు కట్టుబడి ఉంటూనే అద్భుతమైన సేవలను కొన్ని తరాలు గుర్తుండిపోయేలా వివిధ రకాల సహాయ కార్యక్రమాలు చేశారు. చిన్న విషయాలపై కూడా శ్రద్ధ వహించే ఆయన ఎన్నో పనుల్లో సాహసాలు ఎదుర్కొన్నారు. కష్టంతోపాటు సరికొత్త ఆలోచనలు ఉంటే అత్యున్నత శిఖరానికి చేరుతారని మాటలను నిజం చేశారు. అంతేకాకుండా సాధారణ వ్యక్తులు కూడా అఖండ విజయాలు సాధించగలిగే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటారని నిరూపించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు రతన్ టాటా గురించి చెప్పుకుంటూ పోతే రోజులే గడుస్తాయి.
రతన్ టాటా ప్రస్థానం ముందుగా సాధారణ వ్యక్తి జీవితం లాగే ప్రారంభమైంది. హార్మోజీ టాటా, సునులకి మొదటి సంతానమే ప్రపంచ వ్యాపార దిగ్గజ వేత్త రతన్ టాటా.. ఆయన 1937 డిసెంబర్ 28వ తేదీన ముంబై నగరంలో పుట్టారు. ముందుగా రతన్ టాటా అక్కడే ఉన్న ఓ స్కూల్లో విద్య వ్యాసాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత ఆయన ఇతర విద్యలను అభ్యసించేందుకు అమెరికాలోని ఓ అత్యున్నత విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించారు. రతన్ టాటా కి అమెరికా వెళ్లిన తర్వాతే జీవితం అంటే ఇదే అని అర్థమైందట. ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో పెట్టిన రూల్స్ కారణంగా ఇంటికి ఒక డాలర్ నుంచి అర డాలర్ పంపేవారట.. ఇవి అప్పుడు కుటుంబ పోషణకు కూడా సరిపోయేది కాదట. అంతేకాకుండా ఎలాగైనా డబ్బులను కొంతైనా ఇంటికి పంపాలనే తపనతో చిన్నాచితక జాబులు కూడా చేశాడు.
అంతేకాకుండా అమెరికాలోని కొంతకాలం అంట్లు కూడా తోమారని సమాచారం. రతన్ టాటా ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన జీవితం మాత్రం ఇలా సాధారణమైన వ్యక్తి జీవితం మాదిరిగానే ప్రారంభమైంది. ఆ తర్వాత రతన్ టాటా ఓ ఉన్నతమైన విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ గా బిఎస్సి పట్టాను పొందారు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు అక్కడే సాధారణ ఉద్యోగం కూడా చేశారు. ఆ తర్వాత రతన్ టాటా కి ఒక అద్భుతమైన కంప్యూటర్ సంస్థలు జాబ్ ఆఫర్ లభించింది. కానీ ఆయన దానిని వదిలిపెట్టుకొని మరి ఇండియాకి వచ్చారు. అయితే రతన్ టాటా భారతదేశానికి వచ్చే ముందు ఆయన తండ్రి టాటా గ్రూపులో డిప్యూటీ చైర్మన్గా కూడా కొనసాగుతున్నారు.
అయితే తండ్రి టాటా గ్రూపులో ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ రతన్ టాటా మాత్రం ఆ కంపెనీ లో పెద్ద పోస్టు సంపాదించుకోలేకపోయారు. రతన్ టాటా మొదటగా జంషెడ్పూర్ లోని స్టీల్ ఉత్పత్తి విభాగంలో సాధారణ ఉద్యోగిగా అడుగుపెట్టారు. అలాగే ఆయన కొన్ని వేలమంది కార్మికులతో కలిసి నిప్పుల కొలిమి దగ్గర కూడా 9 గంటల పాటు పనిచేసేవారట. ఇలా టాటా కంపెనీలో ప్రారంభమైన తన జీవితం 9 సంవత్సరాల పాటు అదే పరిశ్రమలు వివిధ భాగాల్లో పని చేశారు. ఆ తర్వాత రతన్ టాటా కి 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్గా గొప్ప అద్భుతమైన అవకాశం వరించింది. అయినప్పటికీ రతన్ టాటా ఏమాత్రం ఆనంద పడకుండా ఊరికనే ఉండిపోయాడు.
ఎందుకంటే అప్పటికే ఆ సమస్త నలబై శాతం వరకు నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. అయితే రతన్ టాటా అందులో చేరి సంస్థను ఎలాగైనా లాభాల్లోకి తీసుకెళ్లేందుకు శక్తి సామర్థ్యాలు అన్నీ ఉపయోగించారు. అయితే ఇదే సమయంలో ఆయన చేస్తున్న కృషికిని JRD టాటా గమనించారు. దీనిని గమనించిన ఆయన సొంత కంపెనీలోనే గొప్ప పోస్ట్ ఇచ్చారు. దీని పై కంపెనీలోని చాలామంది సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఆయన పగ్గాలు చేపట్టినప్పుడు ఉత్పత్తులు కేవలం రెండు శాతం మాత్రమే ఉండేవని తెలుస్తోంది. కానీ ఆయన అడుగుపెట్టిన సందర్భంగా మార్కెట్ వాటా ఒక్కసారిగా 25 శాతానికి చేరింది. 1975 సంవత్సరంలోనే ఈ కంపెనీకి సంబంధించిన లాభాలు 113 కోట్లకు ఎగబాకాయి. అంటే ఆయన పట్టుదల కృషి కంపెనీ పై పెట్టిన శ్రద్ధ అంతో ఇంతో కాదు. ఇలా ఎంతో కష్టపడి పనిచేసి ఉన్నత శిఖరాలకు ఎదిగాడు రతన్ టాటా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.