Ravi Shankar Prasad about the suspended MPs: న్యూఢిల్లీ: మూడు రోజుల నుంచి వ్యవసాయ బిల్లులపై పార్లమెంట్ (Parliament) అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రాజ్యసభ ( Rajya Sabha) లో విపక్షపార్టీల సభ్యులు ఆందోళన నిర్వహించి డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పై అనుచితంగా ప్రవర్తించారు. దీంతో సోమవారం చైర్మన్ వెంకయ్య నాయుడు 8మంది సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. విపక్షపార్టీలన్నీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాజ్యసభలో ఆమోదింపజేసిన వ్యవసాయ బిల్లులు, 8మంది సభ్యుల సస్పెన్షన్‌ను పునరాలోచించాలని.. అప్పటివరకు సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు పలు విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ (Ravi Shankar Prasad) సభ నుంచి వస్తూ మీడియాతో మాట్లాడారు. Also read: MPs suspension: సమావేశాలను బహిష్కరించిన విపక్ష పార్టీలు


సస్పెన్షన్‌కు గురైన రాజ్యసభ సభ్యులందరూ క్ష‌మాప‌ణ‌లు చెప్పిన త‌ర్వాత.. వారిపై విధించిన వేటును రద్దు చేసేందుకు ప్ర‌భుత్వం అనుకూలంగా ఉందని ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ స్పష్టంచేశారు. ఓ ఎంపీ ప్రతులను చింపి బల్లపైకి ఎక్కి డ్యాన్స్ వేయడాన్ని తాము ఎప్పుడూ చూడలేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అనుచితంగా ప్రవర్తించిన ప్ర‌తిప‌క్ష స‌భ్యులను మొదట కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంద‌ని తాము భావించినప్పటికీ.. అలా జరగలేదన్నారు. పైగా విదేశాల నుంచి దీనికీ మద్దతుగా ట్వీట్లు వస్తున్నాయంటూ.. పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి లోక్‌సభలో, రాజ్యసభలో స్పష్టమైన మెజారిటీ ఉందని ఆయన మరోసారి స్పష్టంచేశారు. Also read: Rajya Sabha Ruckus: 8 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్