గత ఏడాది నవంబర్ 8న పాత నోట్లు రద్దు చేసిన ఆర్బీఐ.. నోట్లు తిరిగి ఇచ్చేందుకు మూడు నెలల గుడువు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనాలు పాత నోట్లను బ్యాంకుల్లో జమా చేసి కొత్త నోట్లు తీసుకున్నారు. పాత నోట్లు ఎంత వరకు తిరిగి వచ్చాయనే అంశాన్ని ఆర్బీఐ తన వార్షిక నివేదికలో పేర్కొంది. వెయ్యి నోట్లు 99 శాతం తిరిగి వచ్చినట్లు పేర్కొంది. ఆర్బీఐ లెక్కల ప్రకారం మొత్తం 15.44 లక్షల కోట్ల విలువైన 1000, 500 రూపాయల నోట్లు రద్దు కాగా..15.28  లక్షల కోట్ల రూపాయలు విలువైన నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు చేరింది. ఇంకా 8 వేల 900 కోట్ల రూపాయలు  బ్యాకింగ్ వ్యవస్థకు చేరలేదని పేర్కొంది ఆర్బీఐ ప్రకటించింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం దేశంలో నల్లధనం 8 వేల 900 కోట్లుగా తేలింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నల్లధనం విలువ 8 వేల 900 కోట్లు..


ఆర్బీఐ తన నివేదికలో 8 వేల 900 కోట్లు రూపాయలు తన వద్దకు చేరలేదని చెప్పిందంటే ..వాటిని నల్లధనంగా పేర్కొన వచ్చని నిపుణులు చెబుతున్నారు. మోడీ సర్కార్ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో 8 వేల 900 కోట్లు నల్లధనాన్ని అరికట్టినట్లుగా భావించవచ్చు.