Bank Account Closure: రేపట్నించి ఈ బ్యాంకు ఎక్కౌంట్లన్నీ క్లోజ్, మీ ఎక్కౌంట్ ఉందా
Bank Account Closure: బ్యాంక్ ఎక్కౌంట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రేపట్నించి లక్షలాది బ్యాంకు ఎక్కౌంట్లను మూసివేయనుంది. మీ ఎక్కౌంట్ అందులో ఉందో లేదో చెక్ చేసుకోండి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Account Closure: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం జనవరి 1, 2025 నుంచి లక్షల్లో బ్యాంకు ఎక్కౌంట్లు క్లోజ్ కానున్నాయి. సైబర్ నేరాలు, మోసాలు నిరోధించేందుకు , మోసపూరిత కార్యకలాపాలను నియంత్రించేందుకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మూడు రకాల బ్యాంక్ ఎక్కౌంట్లను ఆపివేయనుంది.
దేశవ్యాప్తంగా రేపు అంటే జనవరి 1 నుంచి క్లోజ్ కానున్న బ్యాంక్ ఎక్కౌంట్లలో మీ ఎక్కౌంట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. బ్యాంక్ ఎక్కౌంట్ల మూసివేతలో ఆర్బీఐ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలంగా ఏ విధమైన లావాదేవీలు జరగకుంటే ఆ బ్యాంక్ ఎక్కౌంట్లు క్లోజ్ అవుతాయి. ఓ ఏడాది పాటు అస్సలు పట్టించుకోని ఎక్కౌంట్లు కూడా ఇకపై పనిచేయవు. మీకు ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఎక్కౌంట్లు ఉంటే ఓసారి చెక్ చేసుకోవడం మంచిది. ఏదైనా ఎక్కౌంట్ యాక్టివేషన్‌లో లేకుంటే వెంటనే క్లోజ్ అయిపోతుంది.
మీ ఎక్కౌంట్ క్లోజ్ కాకుండా ఉండాలంటే వెంటనే కనీస మొత్తం లావాదేవీలు ప్రారంభించండి. క్రమం తప్పకుండా లావాదేవీలు చేస్తే వెంటనే ఎక్కౌంట్ యాక్టివేట్ కాగలదు. చాలాకాలంగా లావాదేవీలు లేని జీరో బ్యాలెన్స్ ఖాతాలు కూడా క్లోజ్ అవుతాయి. ఎక్కౌంట్ కోల్పోకుండా ఉండాలంటే వెంటనే లావాదేవీలు చేస్తే యాక్టివేట్ కాగలవు.
ఎందుకంటే హ్యాకర్లు సాధారణగా యాక్టివ్‌గా లేని బ్యాంక్ ఎక్కౌంట్లనే టార్గెట్ చేస్తుంటారు. ఇలాంటి ఎక్కౌంట్లను తమ వశం చేసుకుని లావాదేవీలు చేస్తారు. మీ దగ్గర కూడా ఈ తరహా ఎక్కౌంట్లు ఉంటే వెంటనే యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేయాలనుకుంటే కేవైసీ పూర్తి చేసి లావాదేవీలు చేస్తే చాలు.
Also read: Leopard Alert: చిరుత తిరుగుతోంది నో ఆఫీస్, ఇంట్లోంచే పనిచేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.