Auto Debit New Rules: ఆటోడెబిట్ ఇకపై అంత ఈజీ కాదు, అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు
Auto Debit New Rules: ప్రపంచం ఇప్పుడు డిజిటల్ యుగంగా మారిపోతోంది. అన్నీ ఆన్‌లైన్ లావాదేవీలే. నెలవారీ వాయిదాల విషయంలో ఆటోడెబిట్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇప్పుడీ ఆటోడెబిట్ విధానంలో కొత్తమార్పులు వచ్చాయి. ఆర్బీఐ చేసిన ఆ కొత్త మార్పులు ఇలా ఉన్నాయి.
Auto Debit New Rules: ప్రపంచం ఇప్పుడు డిజిటల్ యుగంగా మారిపోతోంది. అన్నీ ఆన్‌లైన్ లావాదేవీలే. నెలవారీ వాయిదాల విషయంలో ఆటోడెబిట్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇప్పుడీ ఆటోడెబిట్ విధానంలో కొత్తమార్పులు వచ్చాయి. ఆర్బీఐ చేసిన ఆ కొత్త మార్పులు ఇలా ఉన్నాయి.
ప్రస్తుతం ప్రపంచంలో అంతా ఆన్‌లైన్ పేమెంట్స్(Online Payments)జరుగుతున్నాయి. ఎక్కడికెళ్లినా యూపీఐ పేమెంట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. కరెంట్ బిల్, ఓటీటీ బిల్ పేమెంట్స్, ఈఎంఐలు అన్నీ ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ముఖ్యంగా నెలసరి వాయిదాలన్నీ ఆటోడెబిట్ సౌకర్యంతో జరుగుతున్నాయి. చెల్లించాల్సిన వాయిదా తేదీని మనం మర్చిపోకుండా ఉండేందుకు ఆటోడెబిట్ సౌకర్యం ఉపయోగపడుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)ఇప్పుడు ఈ ఆటోడెబిట్ విధానంలో కొత్త మార్పులు చేసింది. ఈ కొత్త మార్పులన్నీ అక్టోబర్ 1 నుంచి అమల్లో రానున్నాయి. ఆ మార్పులేంటనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
ఆటోడెబిట్ లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు(Auto Debit New Rules) అక్టోబర్ 1 నుంచి అమల్లో రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ఆటోడెబిట్ సదుపాయం ఉపయోగించడం అంత సులభం కాదు మరి. క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా ఆటోడెబిట్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలంటే..ఆ చెల్లింపులకు సంబంధించి ఓటీపీ రూపంలో అదనపు ధృవీకరణ అవసరం. దీన్నే ఏఎఫ్ఏ అంటారు. 5 వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి ఆటోడెబిట్ సదుపాయం వినియోగించుకోవాలంటే ఓటీపీ (OTP)అవసరం కానుంది. ఆటోడెబిట్(Auto Debit) తేదీకు కొన్నిరోజుల ముందే ఆ లావాదేవీకు సంబంధించి సమాచారాన్ని వినియోగదారుడికి బ్యాంకులు పంపిస్తాయి. ఆ పేమెంట్ కొనసాగించాలంటే ఓటీపీతో సంబంధిత పేమెంట్‌ను నిర్ధారించాల్సి ఉంటుంది. లేకపోతే పేమెంట్ పూర్తి కాదు. ఆ పరిస్థితి ఎదురైతే మ్యాన్యువల్‌గా లావాదేవీని పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్నిరకాల క్రెడిట్, డెబిట్ కార్డులకు దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలకు రూల్స్ వర్తిస్తాయి. వాస్తవానికి కొత్త నిబంధనలు 2021 ఏప్రిల్ నుంచి అమల్లోకి రావల్సి ఉండేది కానీ బ్యాంకుల అభ్యర్ధన మేరకు ఆరు నెలలపాటు వాయిదా వేసింది. ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లో రానున్నాయి.
Also read: Home Loan Eligibility: హోమ్‌లోన్ కోసం అప్లై చేస్తున్నారా..అయితే ఇవి తప్పకుండా తెలుసుకోవల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook