September Bank Holidays 2024: దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు సెప్టెంబర్ నెలలో కేవలం 15 రోజులే పనిచేయనున్నాయి. అంటే సెప్టెంబర్ నెలలో సగం రోజులు బ్యాంకులు పనిచేయవు. ఈ నెలలో బ్యాంకు పనులుంటే వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదురుకావచ్చు. సెప్టెంబర్ నెలలో ఎప్పుడెప్పుడు ఎక్కడ సెలవులున్నాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం దాదాపు అన్ని పనులు ఆన్‌లైన్‌లో జరుగుతున్నా కొన్ని కీలకమైన పనులకు మాత్రం బ్యాంకులకు వెళ్లక తప్పదు. ముఖ్యంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించేవాళ్లు రోజూ వెళ్లాల్సిందే. అయితే బ్యాంకులకు సెలవులు ఉన్నప్పుడు ఇదంతా ఇబ్బందిగా మారుతుంది. అందుకే ఆర్బీఐ ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా ముందే విడుదల చేస్తుంటుంది. సెప్టెంబర్ బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది. ఈ నెలలో ఏకంగా 15 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇందులో శ్రీమంత శంకరదేవ తిరుభవ తిధి, గణేశ్ చతుర్ధి, ఫస్ట్ ఓనమ్, మీలాద్ ఉన్ నబి వంటి పండుగలతో పాటు రెండవ, నాలుగవ శనివారాలు ఉన్నాయి. 


సెప్టెంబర్ 2024 బ్యాంకు సెలవులు


సెప్టెంబర్ 4 శ్రీమంత శంకరదేవ తిరుభవ్ తిధి అస్సోంలో సెలవు
సెప్టెంబర్ 7 వినాయక చవితి దేశమంతా సెలవు
సెప్టెంబర్ 8 ఆదివారం సెలవు
సెప్టెంబర్ 14 రెండవ శనివారం సెలవు
సెప్టెంబర్ 15 ఆదివారం సెలవు
సెప్టెంబర్ 16 మీలాద్ ఉన్ నబి సెలవు
సెప్టెంబర్ 17 ఇంద్రజాత్ర, ఈద్ ఎ మీలాద్ సిక్కిం, ఛత్తీస్ గఢ్‌లో సెలవు
సెప్టెంబర్ 18 పాంగ్ లాబ్సోల్ సిక్కింలో సెలవు
సెప్టెంబర్ 20 మీలాద్ ఉన్ నబి సెలవు జమ్ము శ్రీనగర్
సెప్టెంబర్ 21 శ్రీ నారాయణ గురు సమాధి రోజు కేరళలోసెలవు
సెప్టెంబర్ 22 ఆదివారం సెలవు
సెప్టెంబర్ 23 మహారాజ హరి సింగ్ జి జమ్ము శ్రీనగర్‌లో సెలవు
సెప్టెంబర్ 28 నాలుగో శనివారం సెలవు
సెప్టెంబర్ 29 ఆదివారం సెలవు


Also read: Aadhaar PVC Card: ఆధార్ పీవీసీ కార్డు అంటే ఏమిటి, ఎలా అప్లే చేసుకోవాలి



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.