RBI New Rules: ఈఎంఐ వంటి చెల్లింపులకు ఇకపై అదనపు ధృవీకరణ అవసరం, ఇవాళ్టి నుంచే అమలు
RBI New Rules: ఆటోమేటిక్ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. చెల్లింపుదారుడి ధృవీకరణ ఇక అవసరం. ఆ కొత్త నిబంధనలు ఇవాళ్టి నుంచి అమల్లోకొచ్చాయి. అవేంటో పరిశీలిద్దాం.
RBI New Rules: ఆటోమేటిక్ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. చెల్లింపుదారుడి ధృవీకరణ ఇక అవసరం. ఆ కొత్త నిబంధనలు ఇవాళ్టి నుంచి అమల్లోకొచ్చాయి. అవేంటో పరిశీలిద్దాం.
ఇప్పటి వరకూ మనం డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా హోంలోన్స్ లేదా ఇతర ఏ చెల్లింపులైనా సరే ఈసీఎస్ ద్వారా ఆటోమేటిక్‌గా చెల్లింపులు(Automatic Payments)చేస్తూ వచ్చాం. ఇకపై అలా లేదు. ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇవాళ్టి నుంచి అంటే అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకొచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం ఆటోమేటిక్ చెల్లింపులకు ఇకపై అదనపు ధృవీకరణ అవసరమవుతుంది. కొత్త నిబంధనలేంటి, ఎలా అమలవుతాయనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
ఆర్బీఐ కొత్త నిబంధనల (RBI New Rules)ప్రకారం చెల్లింపుదారుడి ధృవీకరణ లేకుండా 5 వేలకు మించిన చెల్లింపులు జరగవు. కచ్చితంగా ఓటీపీ ద్వారా ధృవీకరించాల్సిందే. ఆర్బీఐ చెల్లింపుదారుల్ని అప్రమత్తం చేస్తోంది. ఆటోమేటిక్ డెబిట్ చెల్లింపులకు ఇక నుంచి అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటిఫికేషన్ (AFA)అంటే ఏఎఫ్ఏ అవసరం. ఓటీపీ ధృవీకరణ ద్వారానే చెల్లింపు జరుగుతుంది. వ్యక్తిగత చెల్లింపుల్లో భద్రత కోసమే కొత్త విధానం ప్రవేశపెట్టినట్టు ఆర్బీఐ చెబుతోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ , ఫోన్ రీఛార్జ్ , బిల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం, యుటిలిటీ బిల్స్ అన్నీ కొత్త నిబంధనల పరిధిలో రానున్నాయి. ఐదు వేలలోపు పేమెంట్స్‌కు మాత్రం కొత్త నిబంధనలు వర్తించవు.
ఇక నుంచి హోంలోన్స్ ఈఎంఐ(Home Loans EMI), ఇతర చెల్లింపులకు మ్యాన్యువల్‌గా అప్రూవ్ చేయాల్సిందే. ఈ తరహా చెల్లింపులకు యూజర్ల నుంచి ఏ విధమైన అదనపు ఛార్జీల్ని వసూలు చేయరని ఆర్బీఐ స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ఆర్బీఐ(RBI) చెబుతోంది. వివిధ బ్యాంకులు ఇప్పటికే వినియోగదారులకు అలర్ట్ మెస్సేజ్‌లు, మెయిల్స్ పంపించాయి.
ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం(RBI New Rules Details)
అక్టోబర్ 1, 2021 నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమలు
చెల్లింపులకు 24 గంటల ముందు బ్యాంకులు కస్టమర్లను అలర్ట్ చేయాలి
అలర్ట్ మెస్సేజ్ లేదా ఈ మెయిల్ రూపంలో ఉండవచ్చు
5 వేల కంటే ఎక్కువ చెల్లింపులకు యూజర్ నుంచి ఓటీపీ తప్పనిసరి
అన్నిరకాల క్రెడిట్, డెబిట్ కార్డులకు దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలకు కొత్త నిబంధనల వర్తింపు
మ్యూచువల్ ఫండ్ సిప్స్ వంటి చెల్లింపులకు వర్తించదు
Also read: PM Narendra Modi: దేశంలో కొత్తగా జిల్లాకో పీజీ వైద్య కళాశాల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి