Post office scheme: 70 రూపాయల పెట్టుబడితో 3 లక్షలు.. అదిరిపోయే స్కీమ్
Saving scheme in post office: పొదుపు చేసుకోవాలి అనుకునే వారికి కేంద్ర గవర్నమెంటు ఒక మంచి స్కీమ్ ని తీసుకువచ్చింది. మనలో చాలామందికి డబ్బు దాచుకోవడం అంటే బయట వడ్డీకి ఇవ్వడం అనుకుంటారు కానీ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా డబ్బును భద్రంగా దాచుకోవచ్చు అని చాలామందికి తెలియదు. తక్కువ డబ్బు పెట్టుబడి తో మంచి ఆదాయం పొందాలి అనుకునే వారి కోసం ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్..
Saving scheme in post office: భవిష్యత్తు కోసం డబ్బులు భద్రపరుచుకోవాలి అన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది .కానీ ఎలా మొదలు పెట్టాలి? మన దగ్గర ఉన్న తక్కువ డబ్బుతో భవిష్యత్తుకు కావాల్సిన డబ్బును ఎలా భద్రపరుచుకోవాలి అన్న విషయం చాలా మందికి తెలియదు. మన ప్రభుత్వం పౌరుల కోసం పలు రకాల సేవింగ్స్ స్కీమ్స్ ను ప్రవేశపెట్టింది. వీటి గురించి చాలామందికి అవగాహన లేకపోవడం వల్లనే పూర్తిగా వీటిని ఉపయోగించుకో లేకపోతున్నారు. అలాంటి స్కీమ్స్ లో ఒకటే ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్..
ఇటీవల కేంద్రం నవంబర్ డిసెంబర్ త్రైమాసికానిక్ గాను వడ్డీ రేటును 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ పొందాలన్నా, అకౌంట్ ఓపెన్ చేయాలన్నా.. మీరు భారతీయ పౌరులు అవ్వడంతో పాటు 10 సంవత్సరాల వయసు దాటి ఉండాలి. తక్కువ రిస్క్ తో ఈ స్కీమ్ ఎక్కువ రాబడిని ఇస్తుంది. ఈ రికరింగ్ డిపాజిట్ ద్వారా ప్రతి నెల క్రమంగా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తూ రావాలి.
ఇలా చేసిన వారికి కాలవ్యవధిని బట్టి సుమారుగా ఫిక్స్డ్ డిపాజిట్ కి ఎటువంటి వడ్డీని అయితే ఇస్తారో అదే వడ్డీ రేటు ను పొందే అవకాశం ఉంటుంది. ఇలా నెలవారీగా మనం పొదుపు చేసుకుంటూ మంచి అమౌంటును దాచి పెట్టుకోవచ్చు. అయితే మనం ఎంత మొత్తం పొదుపు చేయగలం అనే విషయం మనం పెట్టే పెట్టుబడి, కాలవ్యవధి తదితర అంశాలపై నిర్భరమై ఉంటుంది. కాలవ్యవధి సుమారు 6 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు ఎంచుకోవచ్చు.
నెలవారీగా మీకు వచ్చే ఆదాయంలో కొంత ఆర్‌డీలో డిపాజిట్ చేస్తూ రావడం వల్ల ఒక మంచి మొత్తాన్ని దాచిపెట్టుకోగలుగుతారు. ఇలా పోస్ట్ ఆఫీస్ నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్న ఎన్నో మంచి పథకాలలో ఐదు సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ పథకం కూడా ఒకటి. దీన్ని నేషనల్ సేవింగ్ రికరింగ్ డిపాజిట్ అని పిలుస్తారు. ఈ స్కీమ్ ప్రకారం 60 నెల వారి వాయిదాలకు.. మీరు మీ డబ్బును దాచుకోవచ్చు. మీరు ఒకేసారి ఆరు లేక అంతకంటే ఎక్కువ ఆర్‌డీ వాయిదాలు ముందస్తుగా చెల్లించినట్లయితే రాయితీని కూడా పొందుతారు. 12 వాయిదాలు కట్టిన తర్వాత మీ అకౌంట్ పోస్టులో ఉన్న బ్యాలెన్స్ క్రెడిట్ నుంచి 50% వరకు లోన్ రూపంలో కూడా తీసుకోవచ్చు.అంటే ఈ స్కీం కింద ప్రతినెలా సుమారు 2000 రూపాయలు పెట్టుబడి పెట్టగలిగితే ఐదు సంవత్సరాల కు 1,41,982 లక్షల రిటర్న్స్ వస్తాయి. అదే మీరు 10 సంవత్సరాల పాటు కడితే సుమారు 3.4 లక్షలు పొందవచ్చు.
Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook