Economic Fallout: భారత్ కోరితే తప్పకుండా సేవలందిస్తా.. రఘురాం రాజన్
కరోనా సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న విపత్కర పరిస్థితుల్లో తగిన పరిష్కారం చూపడానికి తనదైన సహకారం అందిస్తానని అన్నారు. ఇందుకు గాను యుఎస్‌లో ఉన్న రాజన్ ఇండియాకు వచ్చేందుకు
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న విపత్కర పరిస్థితుల్లో తగిన పరిష్కారం చూపడానికి తనదైన సహకారం అందిస్తానని అన్నారు. ఇందుకు గాను యుఎస్‌లో ఉన్న రాజన్ ఇండియాకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వూలో రాజన్ మాట్లాడుతూ, మహమ్మారిపై సలహాలు, వ్యూహాలు అమలుచేయడానికి దేశానికి రావాలని కోరితే వస్తానని అన్నారు. 2016 సెప్టెంబర్ వరకు మూడేళ్లపాటు ఆర్‌బిఐ గవర్నర్‌గా పనిచేసిన రాజన్ ప్రస్తుతం అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
భారతదేశ ఆర్థికవిధానాలపై పలు కీలక సూచనలు చేసిన ఆయన తాజాగా అంతర్జాతీయ ద్యవ్యనిథి సంస్థ (ఐఎంఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటైన సలహా బృందంలో చోటు దక్కించుకన్నారు. ప్రపంచవ్యాప్తంగా 12మంది ఆర్థిక నిపుణులతో ఏర్పాటైన ఈ కమిటీలో రఘురామ్ రాజన్‌ను చేరుస్తూ ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవా ఒక ప్రకటన జారీ చేశారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన అసాధారణ సవాళ్లు, పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా దృక్పథాలను అందిస్తుందని ఐఎంఎఫ్ శుక్రవారం తెలిపింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..