Smartphones offers : రూ. 8 వేలకే 4GB RAM, 64GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్
స్మార్ట్ ఫోన్ విక్రయాల్లో పెద్ద కంపెనీలతో పోటీపడేందుకు ప్రయత్నిస్తోన్న రియల్‌మి కంపెనీ తాజాగా మరో న్యూ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్‌ని ఇండియన్ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. రెడ్‌మి 8 డ్యూయల్‌కి పోటీగా రియల్‌మి ప్రవేశపెడుతున్న రియల్‌మి C3 స్మార్ట్ ఫోన్ రెండు వేరియెంట్స్‌లో మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది.
స్మార్ట్ ఫోన్స్ విక్రయాల్లో పెద్ద కంపెనీలతో పోటీపడేందుకు ప్రయత్నిస్తోన్న రియల్‌మి కంపెనీ తాజాగా మరో న్యూ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్‌ని ఇండియన్ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. రెడ్‌మి 8 డ్యూయల్‌కి పోటీగా రియల్‌మి ప్రవేశపెడుతున్న రియల్‌మి C3 స్మార్ట్ ఫోన్ రెండు వేరియెంట్స్‌లో మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. నేటి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచే ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి రియల్‌మి C3 స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. బ్లేజింగ్ రెడ్, ఫ్రోజెన్ బ్లూ కలర్లలో ఈ స్మార్ట్ ఫోన్ లభ్యం కానుంది.
భారత్‌లో రియల్‌మి C3 స్మార్ట్ ఫోన్ ధరలు:
భారత్‌లో రియల్‌మి C3 స్మార్ట్ ఫోన్ ధరలు రూ.6,999 నుంచి ప్రారంభం కానున్నాయి. 3GB ర్యామ్‌తో 32GB ఇన్ బిల్ట్ స్టోరేజీ కలిగిన రియల్ మి C3 స్మార్ట్ ఫోన్ ధర రూ.6,999 కాగా 4GB RAM + 64GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కలిగిన మోడల్ ధర రూ.7,999 గా ఉంది.
రియల్‌మి C3 స్మార్ట్ ఫోన్ ఆఫర్స్:
రియల్‌మి C3 స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు జియో నుంచి రూ.7,550 విలువైన ప్రయోజనాలు పొందనుండగా.. ఫ్లిప్‌కార్ట్ ఫస్ట్ సేల్‌లో రియల్ మి సీ3 ఫోన్ కొన్నవారికి ఏదైనా పాత స్మార్ట్ ఫోన్ ఎక్చేంజ్‌పై రూ.1,000 తగ్గింపు ఇవ్వనున్నట్టు రియల్ మి ప్రకటించింది.
రియల్ మి C3 స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు:
6.5 ఇంచుల హై డెఫినిషన్ డిస్‌ప్లే కలిగిన రియల్ మి C3 మొబైల్లో 12ఎన్ఎం మీడియా టెక్ హీలియో G70 ప్రాసెసర్‌ను అమర్చారు. మైక్రో ఎస్డీ కార్డు సహాయంతో ఇంటర్నల్ స్టోరేజీని పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది. డ్యూయల్ కెమెరాలు కలిగిన ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపున 12 మెగాపిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. హై డైనమిక్ రేంజ్ (HDR), ఫోటోలను అందంగా మలిచే ఏఐ బ్యూటిఫికేషన్ (AI Beautification), పానోరమిక్ వ్యూ ( Panoramic view), టైమ్ ల్యాప్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఈ రియల్ మి స్మార్ట్ ఫోన్ సొంతం. 195 గ్రాముల బరువుండే ఈ స్మార్ట్ ఫోన్‌లో 5,000 మిల్లీయాంప్ హవర్స్ (5000mAh battery)తో లభ్యం అవుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..