Regulation On OTT Platforms: అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓవర్‌ ది టాప్‌ (OTT) వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై నియంత్రణ అవసరమని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఓటీటీలకు నియంత్రణలకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నియమావళిని రేపటిలోగా తమకు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓటీటీ వేదికలపై నియంత్రణ అవసరమని, కొన్ని ఓటీటీ మాధ్యమాలలో ఏకంగా అశ్లీల వీడియోలు ప్రసారం చేస్తున్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఓటీటీలో ప్రదర్శించే కంటెంట్‌ను నియంత్రించేందుకు స్వతంత్ర నియంత్రణ సంస్ధ ఏర్పాటును కోరుతూ దాఖలైన పిటిషన్‌‌పై సుప్రీం ధర్మాసనం(Supreme Court) విచారణ చేపట్టింది. 


Also Read: Reliance Jio: కేవలం రూ.22తో రిలయన్స్ జియో డేటా ప్లాన్, తక్కువ ధరకు ఎన్నో ప్రయోజనాలు


మరోవైపు తాండవ్ వెబ్ సిరీస్ వివాదం నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) కమర్షియల్ హెడ్ అపర్ణ పురోహిత్‌ దాఖలు చేసుకున్న ముందస్తు బయిల్ దరఖాస్తు పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఈ విషయంపై అపర్ణ పురోహిత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం బెంచ్.. తీర్పును రేపటికి వాయిదా వేసింది. ఓటీటీ సంస్థలు కచ్చితంగా తాము ఎలాంటి సమాచారాన్ని ప్రసారం చేయనున్నాయో తెలపాల్సి ఉంటుందని, ఇందుకు స్వయం నియంత్రిత సంస్థను లేదా శాఖను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.


Also Read: Realme: భారత్‌లో అత్యంత చవకైన 5G స్మార్ట్‌ఫోన్ Realme Narzo 30 Pro విక్రయాలు ప్రారంభం


కొన్ని ఓటీటీ సంస్థలు అశ్లీల వీడియోలను సైతం ఎలాంటి నియంత్రణ లేకుండా స్వేచ్ఛగా ప్రసారం చేస్తున్నాయని, సమాజంపై దాని ప్రభావం ఉంటుందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. కనుక కేంద్ర ప్రభుత్వం ఓటీటీల కోసం ఎలాంటి మార్గదర్శకాలు సిద్ధం చేసిందో తమకు వాటిని రేపటిలోగా అందజేయాలని ఆదేశించింది. ఎలాంటి తరహా నియంత్రణ ఉండబోతుంది, ఏ విషయాలను ఓటీటీ నియమావళిలో చేర్చారో తెలుసుకునేందుకు తమకు పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశాలలో పేర్కొంది.


https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook