పోస్టాఫీసుల్లో డిపాజిట్లు  నిర్వహించేవారికి ఉపశమనం కలిగింది. డిపాజిట్లపై వడ్డీని, కాల వ్యవధి తీరిన తర్వాత డిపాజిట్ మొత్తాన్ని పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్లలోనే  డిపాజిట్ చేయాలని గతంలో పోస్టల్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలుత జనవరి వరకు గడువుగా నిర్ణయించగా, దాన్ని ఏప్రిల్‌ 1కు పొడిగిస్తూ తర్వాత ఆదేశాలు జారీ చేశారు. దీంతో డిపాజిట్ చేసేవారు ప్రత్యేకంగా సేవింగ్స్ ఖాతా కూడా తెరవాల్సివచ్చేది. దీని పట్ల ఖాతాదారులు సంతృప్తిగా లేరని గుర్తించిన పోస్టల్ శాఖ గత నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు పేర్కొంది.  ప్రత్యేకంగా బేసిక్‌ సేవింగ్స్‌ ఖాతా తెరిచేందుకు వారు సుముఖంగా లేనందున గత నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు పోస్టల్ శాఖ గత నెల జారీ చేసిన ఆఫీస్‌ ఆఫ్‌ మెమొరాండంలో పేర్కొంది.


గతేడాది నవంబర్‌ నుంచి పలువురు చిన్న మొత్తాల పొదుపు ఖాతాదారులు కాల వ్యవధి తీరిన తమ డిపాజిట్ల కోసం సేవింగ్స్‌ ఖాతాలను తెరిచేందుకు నిరాకరించడం వంటి సంఘటనలు ఎదురయ్యాయి. దీంతో తపాలా శాఖ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో పోస్టల్‌ డిపాజిట్‌ దారులు ఆధార్‌ సమర్పించాల్సిన గడువును కూడా నిరవధికంగా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.