Remdesivir Usage: కరోనా సెకండ్ వేవ్ ప్రాణాంతకమై విజృంభిస్తోంది. మరోవైపు ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత వెంటాడుతోంది. ఈ నేపధ్యంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లపై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. రెమ్‌డెసివిర్ ఉపయోగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది.కరోనా సెకండ్ వేవ్ ( Corona Second Wave) రోజురోజుకూ కోరలు చాస్తోంది. దేశమంతటా చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత(Oxygen Shortage), బెడ్స్ కొరత, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల (Remdesivir injections) కొరత వెంటాడుతోంది. ఈ నేపధ్యంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ ( Union Health Ministry) కీలక ప్రకటన చేసింది. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌ ప్రాణాలను నిలబెట్టే సంజీవని కాదని తెలిపింది. కోవిడ్‌ పేషెంట్లకు అనవసరంగా, అహేతుకంగా రెమిడెసివిర్‌ను వాడటం అనైతికమని స్పష్టం చేసింది. దేశంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్న నేపథ్యంలో రెమిడెసివిర్‌కు తీవ్ర డిమాండ్‌ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ఔషధానికి విపరీతమైన కొరత ఉందని, సరఫరా పెంచాలని అత్యధికంగా కేసులు వస్తున్న రాష్ట్రాలన్నీ కేంద్రాన్ని నిత్యం అభ్యర్థిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం సోమవారం దీని సమర్థత, వాడకంపై స్పష్టతనిచ్చింది.


జాతీయ కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడైన ఎయిమ్స్‌ (AIIMS) డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా సైతం ఈ విషయంపై స్పందించారు.రెమిడెసివిర్‌(Remdesivir Injection) సంజీవని కాదనేది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. మరణాలను ఇది తగ్గించదు. మరో మంచి యాంటీవైరల్‌ డ్రగ్‌ లేనందువల్ల రెమిడెసివిర్‌ను వాడుతున్నాం. ఆసుపత్రుల్లో చేరి... ఆక్సిజన్‌పై ఉన్నవాళ్లకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని రుజువైంది. సాధారణ యాంటీబయోటిక్‌లా దీన్ని వాడకూడదని వివరించారు.


రెమ్‌డెసివిర్ గురించి ముఖ్యమైన విషయాలు


రెమిడెసివిర్‌ ప్రయోగాత్మకంగా పరిశీలనలో ఉన్న ఔషధమే..అత్యవసర వినియోగానికి అనుమతించబడింది.  
కోవిడ్‌–19లో ఇది ప్రాణాలను నిలబెట్టే ఔషధం ( Remdesivir is not a life saver) కాదు. దీనివల్ల మరణాలు తగ్గుతాయని అధ్యయనాల్లో నిరూపితం కాలేదు 
ఆసుపత్రుల్లో ఇన్‌పేషెంట్లకు మాత్రమే రెమిడెసివిర్‌ను ఇవ్వాలి. 
ఓ మోస్తరు వ్యాధి తీవ్రతతో బాధపడుతూ ఆక్సిజన్‌పై ఉన్నవారికి మాత్రమే దీనిని సిఫారసు చేస్తారు. 
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్‌ పేషెంట్లకు రెమిడెసివిర్‌ ఇవ్వకూడదు.


Also read: Corona Death Bells: దేశంలో కరోనా విలయతాండవం, పెరుగుతున్న మరణాల సంఖ్య


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook