పాట్నా : అసెంబ్లీలో పౌర సత్వ సవరణ చట్టం 2019 పై చర్చ సందర్బంగా ఆర్జేడీ నేత  తేజస్వి యాదవ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై  ఘాటు విమర్శలు చేశారు. బీహార్ లో  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని తేజస్వి మండిపడ్డారు. కేంద్రం తెచ్చిన పౌర సత్వ సవరణ చట్టం పై నితీష్ మాట్లాడటాన్ని ఆయన తప్పుబట్టారు.  భారతీయ జనతా పార్టీ తో కలిసి  అధికారాన్ని పంచుకుంటూ సీఏఏను వ్యతిరేకిస్తున్నట్లు నటించడం బీహార్ ప్రజలు గమనిస్తున్నారని నితీష్ కు చురకలంటించారు. 


గతంలో నితీష్ తో  అధికారాన్ని పంచుకున్న ఆర్జేడీ, తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన విషయం  తెలిసిందే. భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక గురువైన  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్  ప్రమాదకరమైనది అని ముఖ్యమంత్రి నితీష్ తనతో  చర్చించిన విషయాన్ని అసెంబ్లీలో గుర్తుచేశారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..