Republic Day 2022: రిపబ్లిక్ డే పరేడ్ లో ఆకట్టుకున్న పలు రాష్ట్రాలు శకటాలివే!
Republic Day 2022: 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని రాజ్ పథ్ వేదికగా పరేడ్ అట్టహాసంగా ప్రారంభమైంది. జాతీయ జెండాను ఎగురవేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వేడుకలను ప్రారంభించారు. ఈ పరేడ్ లో దేశంలోని పలు రాష్ట్రాలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు.
Republic Day 2022: 73వ రిపబ్లిక్ డేను పురస్కరించుకొని ఢిల్లీలోని రాజ్ పథ్ వేదికగా పరేడ్ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మువ్వన్నెల జెండా ఎగురవేసి.. వేడుకలను ప్రారంభించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత సాయుధ దళాలు 21 తుపాకులతో గౌరవ వందనం సమర్పించారు.
ఈ కవాతుకు పరేడ్ కమాండర్, లెఫ్టినెట్ జనరల్ విజయ్ కుమార్ మిశ్రా నాయకత్వం వహించారు. ఈ రిపబ్లిక్ డే పరేడ్ లో అనేక రాష్ట్రాలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు. సైనికుల విన్యాసాల తర్వాత పలు రాష్ట్రాల శకటాలు చూపరులను ఆకర్షించాయి. అందులో మేఘాలయ, గుజరాత్, ఉత్తరాఖండ్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ శకటాలను ప్రదర్శించారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మాట్లాడారు. "కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో, మన శాస్త్రవేత్తలు, నిపుణులు సూచించిన జాగ్రత్తలను పాటించడం దేశంలోని ప్రతి పౌరుడి కర్తవ్యం. దేశంలో కరోనా సంక్షోభం ఉన్నంత కాలం ఈ జాగ్రత్తలను పాటించాలి. కరోనా వైరస్ ప్రస్తుతం విస్తృతంగా వ్యాపిస్తున్నందున.. ప్రస్తుత పరిస్థితుల్లో మనమంతా అప్రమత్తంగా ఉండాలి. కరోనా వ్యాప్తి నియంత్రణ మార్గదర్శకాలైన మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి వాటిని పౌరులందరూ తప్పక పాటించాలని అన్నారు.
Also Read: Republic Day 2022: రిపబ్లిక్ డే పరేడ్ కు ముందు అమరవీరులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులు
Also Read: India Corona Cases Today: దేశంలో 4 కోట్ల మార్క్ ను దాటిన కరోనా కేసులు- పెరిగిన మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.