దేశ రాజధాని ఢిల్లీలో భారత గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.  గణతంత్ర దినోత్సవానికి రాజ్‌పథ్ ముస్తాబవుతోంది.  ఇందుకోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. త్రివిధ దళాలు .. రిపబ్లిక్ డే నాడు జరిగే పరేడ్ కోసం ఇప్పటికే .. అన్ని రకాలుగా సిద్ధమయ్యాయి. తాజాగా .. రిపబ్లిక్ డే పరేడ్ జరిగే రాజ్‌పథ్‌లో డ్రెస్సులలో త్రివిధ దళాల జవాన్లు పరేడ్ చేస్తున్నారు



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిపబ్లిక్ డే రోజున అన్ని రాష్ట్రాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన జరుగుతుంది. వీటితోపాటు భారత రక్షణ మంత్రిత్వ శాఖ తరఫు నుంచి ఆయుధ ప్రదర్శన కూడా నిర్వహిస్తారు. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో 'ధనుష్' ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ధనుష్ 145 mm 52 క్యాలిబర్ హౌట్జర్‌కు సంబంధించిన ఆయుధం. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ.. DRDO తయారు చేసిన ఈ యాంటీ శాటిలైట్ వెపన్‌ను ఈ మధ్యే భారత సైన్యానికి అప్పగించారు.  దీన్ని  తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించనుండం విశేషం. దీని ద్వారా భారత సైన్యం బలం ప్రపంచానికి చాటి చెప్పినట్లవుతుంది. 


రాజ్‌పథ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఉగ్రదాడులు జరగకుండా పటిష్టంగా గస్తీ ఏర్పాటు చేశారు. వచ్చి పోయే వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. మొత్తంగా దేశ రాజధాని ఢిల్లీ నిఘా నీడలో ఉంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..