మేఘాలయ ఎన్నికల్లో రిటైర్డ్ ఇంజనీర్ సత్తా..!
మేఘాలయ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా మవ్ ప్లాంగ్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన ఎస్ కే సన్ భారీ విజయం సాధించారు.
మేఘాలయ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా మవ్ ప్లాంగ్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన ఎస్ కే సన్ భారీ విజయం సాధించారు. ఆయన ఓ రిటైర్డు ఇంజనీరు. ప్రస్తుతం మేఘాలయ హంగ్ దిశగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ పార్టీకి సరైన మెజారిటీ లేకపోవడమే అందుకు ప్రధాన కారణం. 2013లో కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 29 సీట్లు, యూడీపీ 8, హెచ్సీపీడీపీ 4, ఇతరులు 19 సీట్లు గెలుచుకున్నారు.
మేఘాలయలో 60 అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, కమల్‌నాథ్ శనివారం ఉదయమే షిల్లాంగ్‌కు వెళ్లారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మేఘాలయలో మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న భాజాపా కడపటి వార్తలు అందేసరికి కేవలం 5 సీట్లతో కొనసాగుతోంది