Road Accident: రోడ్డు ప్రమాదంలో మోదీ సోదరునికి, మనవడికి గాయాలు
Road Accident: ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడినవారికి జేఎస్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
దేశ ప్రధాని మోదీ సోదరుడైన ప్రహ్లాద్ మోదీ కర్ణాటకలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు మైసూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. మైసూరు నుంచి బండిపురాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ రోడ్డు ప్రమాదం మైసూరు సమీపంలోని కడకోల ప్రాంతంలో జరిగింది. మద్యాహ్నం 1.30 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో ప్రహ్లాద్ మోదీ, ఆయన భార్య, కొడుకు, కోడలు, మనవడు ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోదీతో పాటు కుమారుడు, కోడలు, మనవడు గాయపడగా..జేఎస్ఎస్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రహ్లాద్ మోదీకు ముఖంపై, మనవడు మోహత్ మెహుల్ మోదీకు కాలు ఫ్రాక్చర్ అయ్యాయి. ఇతరులకు కూడా స్వల్పగాయాలయ్యాయి. మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
Also read: BF.7 Scare: కోవిడ్ కేసుల దృష్ట్యా కొత్త ఏడాదిలో ఈ 8 దేశాలకు ప్రయాణం మానుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook