Robotic Elephant in Kerala: హిందూ ఆలయాలో ఏనుగుకు విశిష్ట స్థానం ఉంది. గుడిలోని దేవతామూర్తుల విగ్రహాల ఊరేగింపు, ఉత్సవాల్లో ఏనుగులదే ముఖ్యపాత్ర. అయితే వాటి సహజ జీవనానికి భిన్నంగా ఆలయాల్లో సేవలు అందించాల్సి రావడంతో చాలా ఇబ్బందులు పడుతుంటాయి. వీటి సమస్యలను గుర్తించిన ఫీపుల్ ఫర్ ఎత్నిక్ ట్రీట్ మెంట్ యానిమల్స్ (పెటా) ఇండియా అనే స్వచ్ఛంద సేవా సంస్థ కేరళలోని ఓ ఆలయానికి రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చింది. దీనికి సినీ నటులు పార్వతి తిరువోత్ సపోర్టుగా నిలిచారు. ఈ రోబో ఏనుగును కేరళకు చెందిన నలుగురు యువకులు తయారు చేశారు. దీని తయారీకి రూ.5 లక్షలు ఖర్చులు అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త్రిసూర్ జిల్లాలో గల ఇరింజడప్పిల్లి శ్రీకృష్ణ దేవాలయంలో ఈ రోబోటిక్ ఏనుగు సేవలు అందిస్తోంది. 11 అడుగుల పొడవు, 800 కిలోల బరువుతో ఈ ఏనుగును రూపొందించారు. ఈ ఏనుగుకు 'ఇరింజడప్పిల్లి రామన్' (Irinjadappilly Raman) అని పేరు కూడా పెట్టారు. ఈ ఎలిఫెంట్ భక్తులకు ఆశీర్వాదం కూడా ఇస్తుంది. దీనిపై ఐదుగురు ఎక్కి కూర్చోవచ్చు. స్విచ్ సాయంతో ఏనుగు తొండాన్ని ఆపరేట్ చేయవచ్చు. రోబోటిక్ ఏనుగు ఆలయంలోని ఉత్సవాల్లో పాల్గొంటూ భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. దీనిపై ఆలయ అర్చకులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవాల పేరుతో ఏనుగులను ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు ఎప్పటి నుచో వినిపిస్తుంది. తాజా ఆలోచన అందరి మన్ననలను అందుకుంటుంది. 


Also Read: Firecrackers Explosion: జగన్నాథ్ శోభాయాత్రలో బానాసంచా పేలుడు.. వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  



ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook