RPG Attack: పంజాబ్‌ మొహాలీలోని ఇంటెలిజెన్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌ భవనం లక్ష్యంగా ఆర్పీజీ దాడి జరిగింది. సోమవారం రాత్రి 7 గంటల 45 నిమిషాల ప్రాంతంలో దాడి జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ భవనాన్ని తమ అదీనంలోకి తీసుకుని.. భద్రతను కట్టుదిట్టం చేశారు. పేలుడు దాటికి భవనం మూడో అంతస్తులోని కిటికీలు దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్పీజీ దాడి ఇంటెలిజెన్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌ భవనం పక్క గల్లీ నుంచే జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి వెనక ఉగ్రవాదుల హస్తం ఉందా అనే ప్రశ్నకు పోలీసులు సరైన సమాధానం చెప్పడం లేదు. చిన్న పేలుడే అని చెబుతున్నా.. ఉగ్రదాడి యాంగిల్‌ లో కూడా ఇన్వెస్టిగేషన్‌ చేయాల్సి ఉందని మొహాలీ హెడ్‌ క్వార్టర్స్‌ ఎస్పీ రవీందర్‌ పాల్‌ సింగ్‌ చెప్పారు. ఫోరెన్సీక్‌  బృందాలు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నాయన్నారు. ఎన్‌ఐఏ టీం కూడా కేసును ఇన్వెస్టిగేట్‌ చేస్తుందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఘటనపై పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఎంక్వైరీ రిపోర్ట్‌ కోరారు. ఉదయమే పోలీసు ఉన్నతాధికారులతోనూ అత్యవసర సమావేశం నిర్వహించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఇంటెలిజెన్స్‌ ప్రధాన కార్యాలయానికి 80 మీటర్ల దూరంలోకి ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి రాకెట్‌ దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు. కొందరు అనుమానితులను సైతం అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. సాయంత్రంకల్లా మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. 


పాకిస్తాన్‌ బేస్డ్‌ జైషే మహ్మద్‌ గ్రూప్‌ కమాండర్‌ నుంచి దాడుల సంబంధించి కొద్దివారాల ముందే రెండు వార్నింగ్‌ లేఖలు కూడా వచ్చాయని తెలుస్తోంది. రెండు లేఖల్లో కూడా రైల్వే స్టేషన్‌, బ్రిడ్జిలు, ఆలయాలపై దాడులు చేస్తామని హెచ్చరించినట్టు ఉంది. కొద్దిరోజుల క్రితమే బురైల్‌ జైళ్లోనూ పేలుడు పదార్థాన్ని పోలీసులు గుర్తించారు. వీటన్నింటిని కలుపుకుని పోలీసులు.. రాకెట్‌ దాడి ఘటనను ఇన్వెస్టిగేట్‌ చేస్తున్నారు.


Also Read:Cyclone Asani Live Updates: తీవ్ర తుపాను మారిన 'అసని'... ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ..


Also Read:Bread Biscuit Prices Hike India: సామాన్యులపై మరో భారం..పెరగనున్న ధరలు ఇవే..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook