Central Govt Jobs: భవిష్యత్‌కు బెంగ లేదు.. మంచి వేతనం.. సులువైన పని ఉన్న ఉద్యోగం కోసం ఎదురుచూస్తుంటే మీకోసమే సహాయ లోకో పైలెట్‌ (ఏఎల్‌పీ) ఉద్యోగం ఎదురుచూస్తోంది. ఈ ఉద్యోగం కోసం పెద్దగా చదువుకోనవసరం కూడా లేదు. కేవలం పదో తరగతి, ఐటీఐ/ డిప్లొమా చదివి ఉంటే చాలు. రైల్వే శాఖ నుంచి మరో భారీ ఉద్యోగ ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్‌లలో అసిస్టెంట్‌ లోకో పైలెట్‌ పోస్టు భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటన విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సహాయ లోకో పైలెట్‌ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆర్‌ఆర్‌బీ ప్రకటించింది. ఆర్‌ఆర్‌బీ అధికారిక ప్రాంతీయ వెబ్‌సైట్‌లలో ఏఎల్‌పీ నోటిఫికేషన్‌ 2024 అని పరిశీలిస్తే వివరాలన్నీ తెలుస్తాయి. ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభమవగా ఫిబ్రవరి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సమయం ఉంది చేసుకుందాం లే అని అనుకుంటే గడువు సమయం ముగిసిపోతుంది. ఈ దరఖాస్తుల గడువును మళ్లీ పొడిగించరు. ఇది గ్రహించి వీలైనంత త్వరలో దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించండి.


ఉద్యోగ వివరాలు


  • పోస్టు పేరు: సహాయ లోకో పైలెట్‌

  • ఖాళీలు: 5,696

  • జీతం: రూ.19,000 నుంచి రూ.63,200 వరకు

  • దరఖాస్తు గడువు: జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19వ తేదీ (రాత్రి 11.59 గంటల వరకు)

  • వయసు: 18 నుంచి 30 ఏళ్ల వారు అర్హులు (కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు వయసు సడలింపు ఉంటుంది)

  • దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఎక్స్‌ సర్వీమెన్‌, మహిళలకు రూ.250, మిగిలిన అభ్యర్థులకు రూ.500


ఖాళీల బోర్డులు: అహ్మదాబాద్‌, అజ్మీర్‌, అలహాబాద్‌, బెంగళూరు, భోపాల్‌, భువనేశ్వర్‌, బిలాస్‌పూర్‌, చండీగడ్‌, చెన్నై, గోరఖ్‌పూర్‌, గౌహతి, జమ్మూశ్రీనగర్‌, కోల్‌కత్తా, మాల్దా, ముంబై, ముజఫర్‌పూర్‌, పాట్నా, రాంచీ, సికింద్రాబాద్‌, సిలిగురి, తిరువనంతపురం

Also Read: Tirumala Traffic Jam: తిరుమలలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. ధనుష్‌, నాగ్‌ సినిమాతో భక్తులకు ఇబ్బందులు

Also Read: Telangana High Court: తెలంగాణలో అనూహ్య మలుపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి