Bihar Protests: ఆర్ఆర్‌బీ ఫలితాలపై వివాదం.. అట్టుడుకుతున్న బీహార్.. రైలుకు నిప్పంటించిన విద్యార్థులు
Bihar students protest against RRB NTPC result:విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో రైల్వే బోర్డు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. విద్యార్థులు తమ ఫిర్యాదులు, సూచనలను ఫిబ్రవరి 16 వరకు ఆ కమిటీకి తెలియజేయవచ్చు.
Bihar students protest against RRB NTPC result: ఇటీవల ప్రకటించిన ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పోస్టుల పరీక్షా ఫలితాలపై బీహార్ విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గత రెండు రోజులుగా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. తాజాగా బీహార్‌లోని గయా రైల్వే స్టేషన్‌లో విద్యార్థులు ఓ రైలుకు నిప్పంటించారు. మరో రైలుపై రాళ్లు రువ్వారు. విద్యార్థుల ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చడంతో ప్రస్తుతం బీహార్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది.
బీహార్‌లోని (Bihar) పలు రైల్వే స్టేషన్లలో రైల్వే ట్రాక్‌పై బైఠాయించి విద్యార్థులు నిరసన చేపట్టారు. కొన్నిచోట్ల రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ భారీ ఎత్తున పోలీసులను మోహరించింది. పలుచోట్ల విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విద్యార్థుల నిరసనతో బీహార్‌లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
జెహానాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను రైల్వే ట్రాక్‌పై దగ్ధం చేసి నిరసన (Bihar Protests) తెలియజేశారు విద్యార్థులు. సీతామర్హిలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టారు. బీహార్‌లోని పాట్నా, నవాడా, ముజఫర్‌పూర్, సీతామర్హి, బక్సర్, భోజ్‌పూర్ తదితర జిల్లాలు ఆందోళనలతో అట్టుడికాయి.
విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో రైల్వే బోర్డు (Indian Railway) ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. విద్యార్థులు తమ ఫిర్యాదులు, సూచనలను ఫిబ్రవరి 16 వరకు ఆ కమిటీకి తెలియజేయవచ్చు. ఆ మేరకు ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ సీబీటీ 1 పరీక్షా ఫలితాలను (RRB NTPC CBT1 Result) కమిటీ పరిశీలిస్తుంది. అనంతరం రైల్వే మంత్రిత్వ శాఖకు నివేదికను సమర్పిస్తుంది. నివేదికను పరిశీలించిన పిదప రైల్వే మంత్రిత్వ శాఖ ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ ఫలితాలపై ఒక నిర్ణయానికి వస్తుంది.
Also Read: Radhe Shyam Release: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook