రైల్వేలో 1120 ఎస్సై, 8619 కానిస్టేబుల్ పోస్టులు
పోస్టుల్లో 50 శాతం మహిళలకే.
న్యూఢిల్లీ: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్)లలో 1120 సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై), 8619 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. వీటిలో 4216 కానిస్టేబుల్, 301 ఎస్సై పోస్టులు మహిళలకు కేటాయించారు. అంటే పోస్టుల్లో 50 శాతం మహిళలకే. గతంలో సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన 01/2016కు దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థులు మరోసారి కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ ఎగ్జామ్, పీఈటీ, పీఎంటీల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
- ఆన్ లైన్ దరఖాస్తుల ప్రారంభం: జూన్ 1 నుంచి
- చివరి తేదీ: జూన్ 30
కానిస్టేబుల్ అర్హతలు
- విద్యార్హత: పదోతరగతి ఉత్తీర్ణత, నిర్ణీత శారీరక ప్రమాణాలు ఉండాలి.
- వయసు: 1.7.2018 నాటికి 18 - 25 ఏళ్లలోపు ఉండాలి.
- ఎంపిక విధానం: ఆన్ లైన్ కంప్యూటర్ ఆధారిత టెస్టు ద్వారా.
- పరీక్షల తేదీలు: సెప్టెంబరు, అక్టోబరులో
- ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.40, OBC/SC/STలకు ఫీజు లేదు
ఎస్సై పోస్టులకు...
- విద్యార్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, నిర్ణీత శారీరక ప్రమాణాలు ఉండాలి.
- వయసు: 1.7.2018 నాటికి 20 - 25 ఏళ్లలోపు ఉండాలి.
- ఎంపిక విధానం: ఆన్ లైన్ లో కంప్యూటర్ ఆధారిత టెస్టు ద్వారా.
- పరీక్షల తేదీలు: సెప్టెంబరు, అక్టోబరులో
- ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500, OBC/SC/ST/మహిళలు/Ex Serviceman/ మైనార్టీలు/ఈబీసీ అభ్యర్థులకు రూ.250
కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు, ఎస్సై పోస్టులకు డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు వస్తాయి. 90 నిమిషాల్లో 120 ప్రశ్నలకు జవాబులు రాయాలి. జనరల్ అవేర్ నెస్ నుంచి 50, అరిథ్ మెటిక్ 35, జనరల్ ఇంటిలిజెన్స్, రీజనింగ్ 35 ప్రశ్నలు ఉంటాయి. తెలుగు మాధ్యమంలోనూ పరీక్ష రాసుకోవచ్చు. ఆయా కేటగిరీల వారీ ఖాళీలకు పది రెట్ల సంఖ్యలో మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు (పీఈటీ), ఫిజికల్ మెజర్ మెంట్ టెస్టు (పీఎంటీ) నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులకు సర్టిఫికెట్లు పరిశీలించి శిక్షణలోకి తీసుకుంటారు. కానిస్టేబుల్ కు రూ.21,700 మూల వేతనం, ఎస్సైకి రూ.35,400 మూల వేతనం లభిస్తుంది. వివరాలకు www.indianrailways.gov.inను చూడవచ్చు.