శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో గత శనివారం (జనవరి 11న) ఓ డీఎస్పీతో పాటు ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హిజ్బుల్ ఉగ్రవాదులకు సాయం చేసిన డీఎస్పీ దవీందర్ సింగ్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఈ కేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఉగ్రవాదులకు సహకరించేందుకు వారి వద్ద నుంచి రూ.12 లక్షల రూపాయల్ని దవీందర్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని తమ విచారణలో అంగీకరించాడని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ సోమవారం మీడియాకు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొంతకాలంగా ఉగ్రవాదులతో టచ్‌లో ఉన్న దవీందర్.. వారిని జమ్మూ నుంచి చంఢీగఢ్‌కు తరలించడం, అటు నుంచి న్యూఢిల్లీకి చేర్చేందుకుగానూ భేరం కుదర్చుకున్నాడని విచారణలో తేలింది. గణతంత్ర దినోత్సవం నాడు ఉగ్రదాడులు లక్ష్యంగా హిజ్జుల్ సంస్థ ప్లాన్ చేస్తోందని నిఘా వర్గాలు ఇదివరకే హెచ్చరించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులతో పాటు కారులో ప్రయాణిస్తున్న దవీందర్ పట్టుబట్టాడు. ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ సహా ఇతర అవార్డులను పోలీస్ శాఖ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 


శ్రీనగర్‌లో ఆర్మీ 15 కార్ప్ ప్రధాన కార్యాలయానికి దగ్గర్లో ఉన్న తన ఇంట్లో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించానని ఐబీ, మిలిటరీ ఇంటెలిజెన్స్, రా, పోలీసు విభాగాలు చేసిన విచారణలో దవీందర్ అంగీకరించాడు. దవీందర్‌ గతంలోనూ ఉగ్రవాదులకు ఏమైనా సహకరారం అందించాడా, ఉగ్ర కార్యకలాపాలలో భాగస్వామిగా ఉన్నాడా అనే కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది.


డీఎస్సీ వాహనంలో వెళ్తే సెక్యూరిటీ సిబ్బంది తలెత్తదని  స్కెచ్ వేశారు. కానీ పోలీసుల తనిఖీల్లో దవీందర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు దొరికిపోవడంతో అసలు విషయం తెలుగుచూసింది. ఇద్దరు ఉగ్రవాదులు నవీద్ బాబు అలియాస్ బాబర్ అజామ్, రఫీలతో పాటు డీఎస్పీ దవీందర్ శనివారం సాయంత్రం షోపియన్‌ సెక్టార్‌లో కారులో ప్రయాణిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.  కాగా, 15 దేశాల రాయబారులు, ఇతర ఉన్నతాధికారులకు సెక్యూరిటీ కల్పించే నిమిత్తం గత వారం శ్రీనగర్ దవీందర్ విధులు నిర్వర్తించడం గమనార్హం. ఇదే అదనుగా భావించి ఉగ్రవాదులతో చేతులు కలిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..