ఆర్ఎస్ఎస్ కు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. RSSకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఆర్ఎస్ఎస్ ఆఫీసులు, నాయకులను అంతర్జాతీయ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని ఇంటెలిజెన్స్ ఓ నివేదికలో పేర్కొంది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ నాయకులు, ఆఫీసులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. RSSకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఆర్ఎస్ఎస్ ఆఫీసులు, నాయకులను అంతర్జాతీయ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని ఇంటెలిజెన్స్ ఓ నివేదికలో పేర్కొంది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ నాయకులు, ఆఫీసులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కార్యాలయాల్లో భద్రత కట్టుదిట్టం చేసుకోవాలని సూచించింది. ఆర్ఎస్ఎస్ ఆఫీసుల్లో ఐఈడీ బాంబులు పెట్టి పేల్చి వేసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే ఆర్ఎస్ఎస్ నాయకులు వ్యక్తి భద్రత కట్టుదిట్టం చేసుకోవాలని . . లేని పక్షంలో వాహనాల్లో ఐఈడీ బాంబులతో వారిపై దాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఇంటెలిజెన్స్ బ్యూరో తమ నివేదిక పంపించింది.
ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అసోం, పంజాబ్, రాజస్థాన్ భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. గత నెల ఆర్ఎస్ఎస్ కార్యకర్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఆరుగురు వ్యక్తులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మహ్మద్ ఇర్ఫాన్, సయ్యద్ అక్బర్, సయ్యద్ సిద్ధిఖీ అక్బర్, అక్బర్ బాషా, సనావుల్లా షరీఫ్, సాదిక్ ఉల్-అమీన్ గా గుర్తించారు. వారిని విచారించగా .. దేశంలో పలు దాడులకు సంబంధించిన కుట్ర బయట పడిందని పోలీసులు చెబుతున్నారు.