మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కు బంపర్ ఆఫర్ వచ్చిపడింది. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించనున్నారు.. ఇది నమ్మసక్యంగా లేదు కదూ. అయితే శివసేన సీనియర్ నేత రౌత్ వ్యాఖ్యలను బట్టి ఇదే నిజమౌతుందని అనిపిస్తోంది.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ ఏ విధంగా చూసినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఈ సారి 110 సీట్ల వరకూ కోల్పోవడం ఖాయమని అని జోస్యం చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీని ప్రతిపాదించేందుకు ఆర్ఎస్ఎస్ సన్నద్ధమవుతోందని రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 


అందరివాడు ప్రణబ్..


 రౌత్ చెప్పినట్లు బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోయినట్లయితే అన్ని పార్టీలకు ఆమోదయోగ్యుడైన అందరివాడు ప్రణబ్ ను తెరపైకి బీజేపీకి తీసుకురావచ్చంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. నాగ్‌పూర్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ వార్షిక కార్యక్రమానికి ప్రణబ్ ముఖర్జీ హాజరైన నేపథ్యంలో రౌత్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది.


ఇది ఎవరి వాయిస్ ?


శివసేన అధినేత ఠాక్రేతో అమిత్ షాత్ భేటీ జరిగిన రెండు రోజులకే శివసేన నేత రౌత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇది నిజంగా ఆర్ఎస్ఎస్ మనసులో ఉన్న మాటేనా..లేదంటే శివసేన మనసులో మాట అనే విషయం తేలాల్సి ఉంది. అయితే దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠత నెలకొంది.