8 ఒప్పందాలపై సంతకాలు చేసి, రష్యా బయల్దేరిన వ్లాదిమిర్ పుతిన్
![8 ఒప్పందాలపై సంతకాలు చేసి, రష్యా బయల్దేరిన వ్లాదిమిర్ పుతిన్ 8 ఒప్పందాలపై సంతకాలు చేసి, రష్యా బయల్దేరిన వ్లాదిమిర్ పుతిన్](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2018/10/05/174823-vladimir-putin-leaves-for-russia-after-two-day-visit-to-india.jpg?itok=GpDhI4qU)
ఢిల్లీ నుంచి రష్యా బయల్దేరిన వ్లాదిమిర్ పుతిన్
రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం భారత్ వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ విమానాశ్రయం నుంచి రష్యా బయల్దేరి వెళ్లారు. భారత్-రష్యా 19వ వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనేందుకు భారత్ వచ్చిన పుతిన్ ఈ పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు, పలు అభివృద్ధి అంశాలు చర్చకొచ్చాయి. ఈ పర్యటనలో వ్లాదిమిర్ పుతిన్, నరేంద్ర మోదీ ఇరు దేశాల మధ్య జరిగిన 8 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.