గుజరాత్‌లోని నర్మదా నది మధ్యలో కేవడియా వద్ద స్టాట్యూ ఆఫ్ యూనిటి పేరుతో నిర్మించిన 182 మీటర్లు (597 అడుగులు) ఎత్తైన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని నేడు సర్దార్ పటేల్ 143వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. జాతిని ఐక్యమత్యంతో ఉంచాలనే ధృడ సంకల్పానికి పెట్టింది పేరైన ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్. అందుకే ఆయన స్మారకార్ధంగా స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో మూడేళ్ల క్రితం గుజరాత్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొప్ప నిర్మాణం ఇది. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహంగా రికార్డుకెక్కింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కార్యక్రమానికి అనేక మంది కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, గవర్నర్లు, బీజేపీ అగ్రనేతలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.


#WATCH: Inauguration of Sardar Vallabhbhai Patel's #StatueOfUnity by PM Modi in Gujarat's Kevadiya pic.twitter.com/PKMhielVZo